‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ డ్రామా ‘మిరాయ్’ (Mirai). రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదట్లో ఈ ప్రాజెక్టుపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
దీంతో సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. టికెట్ రేట్లు తక్కువగా ఉండడం, థియేట్రికల్ బిజినెస్ కూడా తక్కువకే జరగడం వల్ల సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ సాధించింది. బయ్యర్స్ అంతా బయటపడిపోయారు. తర్వాత 2వ వారం కూడా సినిమా బాగానే పెర్ఫార్మ్ చేసింది. అలాగే 3వ వీకెండ్ ‘ఓజి’ వంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ.. ఉన్నంతలో బాగానే కలెక్ట్ చేసింది.
ఒకసారి 17 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 21.47 cr |
సీడెడ్ | 5.50 cr |
ఉత్తరాంధ్ర | 4.55 cr |
ఈస్ట్ | 2.57 cr |
వెస్ట్ | 1.61 cr |
గుంటూరు | 2.15 cr |
కృష్ణా | 2.43 cr |
నెల్లూరు | 1.35 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 41.63 cr(షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ | 7.87 cr |
ఓవర్సీస్ | 13.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 62.8 cr(షేర్) |
‘మిరాయ్’ (Mirai) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 17 రోజుల్లో ఏకంగా రూ.62.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.34.3 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.