‘మిరాయ్’ (Mirai) సినిమా గురించి గత కొన్ని రోజులుగా చాలా రకాల వార్తలు వస్తున్నాయి. సగటు సినిమాకు ఇది భిన్నంగా ఉంటుందని, సూపర్ హీరో కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇంతకుముందే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ విపరీతమైన పరిస్థితుల్లో సినిమాను చిత్రీకరరించారు అని సమాచారం. ఎముకులు కొరికే చలిలో కీలక సన్నివేశాలను చిత్రబృందం ఇటీవల చిత్రీకరించి వచ్చింది అని తెలుస్తోంది. క్లియర్‌గా చెప్పాలంటే మైనస్ 18 డిగ్రీల చలిలో షూటింగ్ జరిపారట.
‘హను – మాన్’ (Hanu-Man) సినిమా తర్వాత యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) మరోసారి సూపర్ మ్యాన్ పాత్రలోనే కనిపింబోతున్నాడు. ఈ క్రమంలో బహుభాషా చిత్రంగా రూపొందుతున్న ‘మిరాయ్’ సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా ఓ కీలక షెడ్యూల్‌ను ముగించుకుని వచ్చింది అని సమాచారం. నేపాల్‌లోని ముస్తాంగ్‌లో ఈ షూటింగ్ నిర్వహించారట.
అందులో భాగంగా మైనస్ 18డిగ్రీల చలిలో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. ఆ సన్నివేశాలు సినిమాకు చాలా కీలకంగా ఉంటాయి అని టీమ్ చెబుతోంది. రితికా నాయక్ (Ritika Nayak) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ షెడ్యూల్‌ను ఈ నెల ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో పెడుతున్నారట. ఇరవై రోజులు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
తేజ సూపర్ యోధ పాత్రలో నటించనున్న ఈ సినిమాలో రితిక కూడా సూపర్ పవర్స్ ఉన్న వుమెన్‌గా కనిపిస్తుందట. మంచు మనోజ్ ఈవిల్ పవర్స్ ఉన్న విలన్‌గా ఉంటాడట. ఈ లెక్కేంటో తేలాలంటే ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న పీపుల్స్ టీమ్‌కి ఈ సినిమా ఫలితం చాలా కీలకం.