టాలీవుడ్ బడా నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. వరుస సినిమాలు చేస్తూ.. థియేటర్లకు, ఓటీటీలకు ఎక్కువ ఫీడింగ్ ఇస్తున్న ప్రొడ్యూసర్ అంటే ఇతనే. అయితే నాగవంశీపై నిత్యం ఏదో చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి అతనిపై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే అతను నిర్మించే సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందే సినిమాలకు సంబంధించిన విషయాల్లో.. అంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఇతనే అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు.
అవి కనుక టైంకి ఇవ్వకపోతే.. ఇతన్ని సోషల్ మీడియాలో ఆడుకుంటూ ఉంటారు. అంతేకాదు ప్రమోషన్స్ లో ఇతను తన సినిమాలకి ఇచ్చే హైప్ కూడా ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతూ ఉంటుంది. దాని విషయంలో కూడా నాగవంశీని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇది పక్కన పెడితే.. ఇప్పుడు ఇండస్ట్రీ నుండి కూడా నాగవంశీపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తుంది. విషయంలోకి వెళితే… 2026 సంక్రాంతికి ఆల్రెడీ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ , చిరంజీవి- అనిల్ రావిపూడి..ల ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటనలు వచ్చాయి.
మరోపక్క నాగవంశీ నిర్మిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాని కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘ది రాజాసాబ్’ జనవరి 9న వస్తుంది. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ డేట్ ఇంకా ప్రకటించలేదు. జనవరి 12 అంటున్నారు. ఒకవేళ ఆ డేట్ కి కనుక ఆ సినిమా వస్తే.. దానికి 2 రోజులే పవర్ ప్లే ఉన్నట్టు. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి సినిమా అంటే యూత్ లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది.
‘ది రాజాసాబ్’ మేజర్ రికవరీకి 3 రోజులు సరిపోతుంది. తర్వాత టాక్ ను బట్టి దాని రన్ ఉంటుంది. ‘అనగనగా ఒక రాజు’ చూస్తుంటే అది పక్కా పండగ సినిమా అనిపిస్తుంది. అప్పుడు చిరంజీవి- అనిల్ రావిపూడి..ల సినిమాకి పెద్ద ఇబ్బందే. అందుకే ‘అనగనగా ఒక రాజు’ పేరు చెప్పి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాకి రేట్లు తగ్గించమని బయ్యర్స్ అడుగుతున్నారట.దీంతో సంక్రాంతి రేసు నుండి ‘అనగనగా ఒక రాజు’ ని తప్పించమని నాగవంశీ పై దిల్ రాజు, సాహు గారపాటి..లతో పాటు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది.