Miral Review in Telugu: మిరల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 18, 2024 / 05:03 PM IST

Cast & Crew

  • భరత్ (Hero)
  • వాణి భోజన్ (Heroine)
  • K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు (Cast)
  • ఎం శక్తివేల్ (Director)
  • సిహెచ్ సతీష్ కుమార్ (Producer)
  • ప్రసాద్ ఎస్ ఎన్ (Music)
  • సురేష్ బాలా (Cinematography)
  • Release Date : మే 17, 2024

‘ప్రేమిస్తే’తో తెలుగులో కూడా కొంత ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు భరత్. దీంతో అతని సినిమాలని తెలుగులో కూడా పోటీ పడి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు మేకర్స్. కానీ ఆ తర్వాత భరత్ నుండి వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. ‘స్పైడర్’ (Spyder) , ‘హంట్’ (Hunt) వంటి తెలుగు సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసినా అతనికి ప్లస్ అవ్వలేదు. అయితే ఇతను హీరోగా రూపొందిన ‘మిరల్’ అనే ఓ తమిళ సినిమా..

2 ఏళ్ళ తర్వాత అదే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఇదొక హర్రర్ కమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. పెద్దగా చప్పుడు చేయకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : హరి (భరత్ (Bharath) రమ (వాణీ భోజన్ (Vani Bhojan) ) భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఓ కుమారుడు సాయి (మాస్టర్ అంకిత్) కూడా ఉంటాడు. అయితే ఈ ముగ్గురూ కలిసి ఊరు వెళ్తుండగా ఎవరో ముసుగు మనిషి దాడి చేసి సాయిని ఎత్తుకుపోయినట్టు రమ కి పీడ కల వస్తుంది. అయితే ఆ తర్వాత హరికి నిజంగానే ఓ పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. లక్కీగా దాని నుండి అతను తప్పించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రమ తల్లి.. వాళ్లకి ఫోన్ చేసి ‘జాతకాలు చూపించకుండా మీరు పెళ్లి చేసుకున్నారు, కాబట్టి ఇద్దరి జాతకాల్లో ఓ ప్రమాదం పొంచి ఉన్నట్టు’ జోస్యం చెబుతుంది.

దీనికి పరిహారంగా ఊరు వెళ్ళి తమ కుల దైవానికి పూజ చేయించుకోవాలని కోరుతుంది. అలా వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న హరి ఫ్యామిలీకి కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వారు ప్రయాణిస్తున్న దారిలో 15 ఏళ్ల క్రితం మరో ఫ్యామిలీ ప్రయాణించి ఓ ఆత్మ చేతిలో ప్రాణాలు కోల్పోయినట్టు వారికి తెలుస్తుంది. విషయం తెలుసుకున్న హరి అండ్ ఫ్యామిలీ ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డారు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : భరత్ ప్రామిసింగ్ యాక్టర్ అని తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ అతనిలో మరో కోణాన్ని మన తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు. ‘ప్రేమిస్తే’ లో మాదిరి అమాయకంగా ఉండే నటుడిని మాత్రమే యాక్సెప్ట్ చేశారు.’మిరల్’ లో హరి అనే పాత్రకి కూడా తన బెస్ట్ ఇచ్చాడు. కానీ ఆ పాత్ర భరత్ ఇమేజ్ కి రేంజ్ కి తగ్గ పాత్ర కాదు. ‘మీకు మాత్రమే చెప్తా’ (Meeku Maathrame Cheptha) తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వాణీ భోజన్ ఆ తర్వాత ఆఫర్లు పట్టడంలో విఫలమైంది.

రమ పాత్రలో ఆమె బాగానే చేసింది కానీ ఇది ఆమె కెరీర్ కి మైలేజ్ ఇచ్చే పాత్ర కాదు. కె ఎస్ రవికుమార్ (K. S. Ravikumar) ,రాజ్ కుమార్ ..ల పాత్రలు తప్ప మిగిలిన వారివి ఎలాంటి ఇంపాక్ట్ చూపించవు.ప్రసాద్ ఎస్ ఎన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే.క్లైమాక్స్ లో అది బాగా కుదిరింది అని చెప్పొచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు : చెప్పాలంటే చాలా మంది ప్రేక్షకులు ‘మిరల్’ తమిళ వెర్షన్ చూడలేదు. తమిళంలో అయితే ఈ సినిమా మంచి రివ్యూస్ ను రాబట్టుకుంది. కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయిన సినిమా కాదిది. అందుకే ఓటీటీలో సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసే ఆప్షన్ ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఇన్నాళ్లు ఈ సినిమాని పట్టించుకోలేదు. అందులోనూ తమిళ విశ్లేషకులు ఇది ప్రయోగాత్మక సినిమా అంటూ రాసుకొచ్చారు. కానీ తెలుగు ప్రేక్షకులకి ఇది అలా అనిపించదు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలైన్లతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.

అందుకే దర్శకుడు ఎం శక్తివేల్ పనితనం కూడా అందుకే ఇంప్రెస్ చెయ్యదు. కాకపోతే ఇటీవల వచ్చిన ‘బాక్’ మాదిరి కొన్ని హర్రర్ సన్నివేశాలు బాగా కుదిరాయి. భయపెట్టే రేంజ్లో అవి ఉన్నాయి. ఆ సన్నివేశాలు వచ్చే 5 నిమిషాల ముందు నుండీ ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవుతుంది. సినిమాటోగ్రఫీ కూడా అందుకు సహకరించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. కానీ డబ్బింగ్ మాత్రం ఎందుకో సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది.

విశ్లేషణ : ‘మిరల్’ రొటీన్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీనే..! కానీ కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగా కుదిరాయి.హారర్ ఎలిమెంట్స్ ని అమితంగా ఇష్టపడే వారు టైం పాస్ కి ఒకసారి ట్రై చేయొచ్చు.అది కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేయకుండా..!

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus