మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిరపకాయ్’. ‘ఎల్లో ప్లవర్స్’ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ప్రకాష్ రాజ్, నాగేంద్ర బాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సునీల్, అలీ ల కామెడీ బాగా హైలెట్ అయ్యింది. అందుకే సంక్రాంతి కానుకగా 2011 వ సంవత్సరం జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తికావస్తోంది.
దీంతో రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో మిరపకాయ్ హ్యష్ ట్యాగ్ లతో హల్ చల్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 4.90 cr |
సీడెడ్ | 2.85 cr |
ఉత్తరాంధ్ర | 1.72 cr |
ఈస్ట్ | 1.45 cr |
వెస్ట్ | 1.25 cr |
గుంటూరు | 1.45 cr |
కృష్ణా | 1.02 cr |
నెల్లూరు | 0.69 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.97 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 17.30 cr |
‘మిరపకాయ్’ చిత్రానికి రూ.13.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.17.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆ సంక్రాంతికి పోటీగా ‘సిద్దార్థ్ ‘అనగనగా ఒక ధీరుడు’, బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’, సుమంత్ ‘గోల్కొండ హైస్కూల్’ వంటి చిత్రాలు పోటీగా విడుదలైనప్పటికీ ‘మిరపకాయ్’ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బయ్యర్లకి ఈ చిత్రం రూ.3.8 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా కూడా నిలిచింది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!