Miryala Ravinder Reddy: ఇంటర్వ్యూ : ‘పెదకాపు 1’ గురించి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పిన ఆసక్తికర విషయాలు..!

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ‘ద్వారకా క్రియేషన్స్‌’ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :

ప్ర) ‘పెదకాపు 1’ చిన్న సినిమా అనుకున్నారు.. కానీ దీని స్పాన్ పెద్ద సినిమా రేంజ్లో పెరిగింది.. ఎలా అనిపిస్తుంది?

మిర్యాల రవీందర్ రెడ్డి : చాలా ఆనందంగా ఉంది. పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతోనే మొదలుపెట్టాం. అది నిజమైంది.

ప్ర) ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీని కొత్త వాళ్ళతో చేయడానికి కారణం?

మిర్యాల రవీందర్ రెడ్డి : ఇందులో రిస్క్ ఏమీ లేదు. కొత్తవాళ్లతో చేస్తేనే వర్కౌట్ అయ్యే కథ ఇది. ఎమోషన్ కి, కథకి కనెక్ట్ అవ్వాలి అంటే కొత్త హీరో, హీరోయిన్స్ అయితేనే బాగుంటుంది.అదే స్టార్స్ తో వెళితే.. ప్రేక్షకులకి కొన్ని సహజంగా అనిపించవు.

ప్ర)ఈ సినిమా టైటిల్, ట్రైలర్ అన్నీ కూడా జనాలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి అని అంతా అనుకుంటున్నారు?

మిర్యాల రవీందర్ రెడ్డి : అది తప్పు..! సినిమాలో అంతా మంచే చూపిస్తే మారిపోయే వాళ్ళు ఉన్నారా. కథని, ఎమోషన్ ను నమ్మి చేయడానికి రంగంలోకి దిగితే అలాంటివేమీ అనిపించవు.

ప్ర)టైటిల్ పై చాలా కాంట్రవర్సీ జరిగింది?

మిర్యాల రవీందర్ రెడ్డి : కాంట్రవర్సీ అనడానికి లేదు..! మమ్మల్ని కూడా మా ఊర్లో వీళ్ళు కాపోళ్లు , పెద కాపోళ్లు అంటూ చెబుతుంటారు. వాళ్ళ ఉద్దేశం మేము కాపలాగా అండగా ఉండేవాళ్ళం అని..! క్యాస్ట్ కి కనెక్ట్ అవుతున్నారు.. అవ్వాలి అనడం తప్పు.

ప్ర) ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పెద్ద స్టార్ తో సినిమా చేసే అవకాశం ఉంది కదా. ఎందుకు కొత్త హీరోతో చేశారు?

మిర్యాల రవీందర్ రెడ్డి : అవును నిజమే..! ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం ప్రెజర్ గా అనిపించింది. మూడు నెలల పాటు చాలా ఆలోచించాను. ఒక పెద్ద హీరోని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. అందుకే ఈ ప్రాజెక్టు చేయడానికి ముందడుగు వేశాం.

ప్ర)’పెదకాపు’ చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన ఎలిమెంట్ ఏంటి?

మిర్యాల రవీందర్ రెడ్డి : ప్రతి కథలో బలవంతుడు, బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది. ఇందులో గోదావరి నేపధ్యం తోడైంది. ప్రతి సీన్ అందరినీ కదిలిస్తుంది. డైరెక్టర్ శ్రీకాంత్ గారు రాసిన ఒక్కో డైలాగ్ అందరికీ గుచ్చుకుంటుంది.

ప్ర) శ్రీకాంత్ అడ్డాల గారిని ఏకంగా వెట్రిమారన్ తో పోల్చారు ..?

మిర్యాల రవీందర్ రెడ్డి : ఇది సినిమా చూశాక అందరూ ఒప్పుకుంటారు. మనకి ఓ వెట్రిమారన్ శ్రీకాంత్ అడ్డాల గారి రూపంలో దొరికాడు.

ప్ర) సినిమా సక్సెస్ అయితే రెండో పార్ట్ ఉంది అంటుంటారు.. ఈ సినిమాకి ముందుగానే రెండో పార్ట్ ఉందని ప్రకటించడం రిస్క్ అనిపించలేదా ?

మిర్యాల రవీందర్ రెడ్డి : కథ పరంగా ఇది రెండు భాగాలుగా చెయ్యాల్సి వచ్చింది. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు ఉన్నాయి. అందుకే ముందుగానే జనాలను ప్రిపేర్ చేయడం జరిగింది.

ప్ర) సెన్సార్ రెస్పాన్స్ ఎలా అనిపించింది..!

మిర్యాల రవీందర్ రెడ్డి : మా సినిమాకి ‘ఎ’ రేటింగ్ ఇచ్చారు. కొంచెం వయొలెన్స్ ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో..!కానీ టాక్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పారు.

ప్ర) హీరో విరాట్ కర్ణని.. సత్యానంద్ గారు ప్రభాస్ తో పోల్చారు.. ఎలా అనిపించింది?

మిర్యాల రవీందర్ రెడ్డి : చాలా ఆనందంగా అనిపించింది.. అంతకి మించి మాటలు లేవు..! అయితే మా ఫ్యామిలీ హీరో కదా అని నేను ఎక్కువ రిఫర్ చేసింది అంటూ ఏమీ లేదు. మొదట కొన్ని రోజులు చూద్దాం. బాగా చేస్తున్నాడు అంటే ఓకే. లేదంటే.. నాకు సినిమానే ముఖ్యం. హీరోని మార్చేద్దాం అన్నాను. దర్శకుడు శ్రీకాంత్ గారు లేదండీ మన కథకి ఇతను యాప్ట్ అని చెప్పారు. అలా ముందుకు వెళ్ళాం..!

ప్ర) ‘#PK1’ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రమోషన్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనా?

మిర్యాల రవీందర్ రెడ్డి : లేదు..! టైటిల్ ను బట్టే అలా ప్రమోట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ .. తమ హీరో కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కనెక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు అంతే.!

ప్ర) అఖండ 2 ముందుగా వస్తుందా.. ‘పెదకాపు 2’ ముందుగా వస్తుందా ?

మిర్యాల రవీందర్ రెడ్డి : అది కచ్చితంగా (Miryala Ravinder Reddy) చెప్పలేను. కానీ అఖండ 2 అయితే కచ్చితంగా ఉంటుంది.

ప్ర) ‘అఖండ 2’ ఎప్పుడు మొదలవుతుంది?

మిర్యాల రవీందర్ రెడ్డి : అది బోయపాటి గారిని అడగాలి. బాలకృష్ణ గారికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి కదా.కొంచెం టైం పడుతుంది.

ప్ర) ‘పెదకాపు 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?

మిర్యాల రవీందర్ రెడ్డి : 2024 ఆరంభంలో ఉంటుంది. అదే ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. పార్ట్ 3 కూడా ఉండొచ్చు.

ప్ర) ‘అఖండ’ నిర్మాత సినిమా, ‘అఖండ’ దర్శకుడి సినిమా ఒకేసారి రావడానికి కారణం?

మిర్యాల రవీందర్ రెడ్డి : ఇది ప్లాన్ చేసుకుంది కానీ..! చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. బోయపాటి గారు కూడా ఈ విషయం తలుచుకుని బాధపడుతున్నారు. కానీ ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ మార్చాం కాబట్టి.. ఇక తప్పదు..!

ప్ర) మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ?

మిర్యాల రవీందర్ రెడ్డి : ‘పెదకాపు2’ పనులు ఉన్నాయి. అలాగే ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ గారితో ఓ సినిమా అనుకుంటున్నాం. అలాగే ఓ మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఉంది. అడివి శేష్ గారితో ఒక సినిమా ఉంటుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus