Mishan Impossible: తాప్సి ‘మిషన్ ఇంపాజిబుల్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • April 1, 2022 / 01:56 PM IST

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ అధినేతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ పోలిశెట్టితో `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్.ఎం.పాషా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్ల‌లు ఓ క్రైమ్లో ఇరుక్కోవడం…

Click Here To Watch NOW

వారిని తాప్సి అండ్ టీం ఎలా కాపాడింది. అసలు వాళ్ళు ఏ క్రైమ్ లో ఇరుక్కున్నారు అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది? ముగ్గురు పిల్లలుగా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. చిన్న చిత్రమైనా ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

వాటి వివరాలను ఓసారి గమనిస్తే :

నైజాం 0.60 cr
సీడెడ్ 0.32 cr
ఉత్తరాంధ్ర 0.30 cr
ఈస్ట్+వెస్ట్ 0.20 cr
కృష్ణా+గుంటూరు 0.30 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ 1.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.22 cr

‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి రూ.2.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ చిన్నదే అయితే.. పోటీగా ‘ఆర్.ఆర్.ఆర్’ ఉండడంతో ఈ మూవీ లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. హిట్ టాక్ కనుక వస్తే.. ఉగాది సెలవుతో మంచి వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. మరో వైపు నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ మూవీకి మరో రూ.3.5 కోట్లు పైనే వసూలైనట్టు తెలుస్తుంది. సినిమాని రూ.4 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేశారు కాబట్టి, నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్స్ దక్కాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus