Mishan Impossible Review: మిషన్ ఇంపాజబుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 1, 2022 / 03:41 PM IST

తాప్సీ ప్రధాన పాత్రలో ముగ్గురు చిన్నపిల్లలు కీలకపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “మిషన్ ఇంపాజబుల్”. “ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ”తో తొలి సినిమాతోనే అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న స్వరూప్ తెరకెక్కించిన రెండో చిత్రమిది. విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని నెలకొల్పాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: రఘుపతి రాఘవ రాజారాం అనే ముగ్గురు పిల్లలు తెలిసీ తెలియక చేసిన ఒక సాహసం ఓ పెద్ద చిల్డ్రన్ ట్రాఫికింగ్ ను బట్టబయలు చేస్తుంది. అందుకు జర్నలిస్ట్ తాప్సీ తోడుగా నిలుస్తుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేదానికి కథారూపమే “మిషన్ ఇంపాజబుల్” చిత్రం.

నటీనటుల పనితీరు: తాప్సీ పాత్ర ఈ చిత్రంలో ఎక్స్టెండెడ్ క్యామియో లాంటిది. సినిమా మొత్తం ముగ్గురు పిల్లల చుట్టూనే తిరుగుతుంటుంది. ముగ్గురు పిల్లలూ అద్భుతంగా నటించారు. ప్రత్యేక పాత్రల్లో తమిళ, కన్నడ నటులు ఉండడం సినిమాకి మార్కెట్ పరంగా ప్లస్ అయ్యింది కానీ.. రీజనల్ కనెక్టివిటీ మిస్ అయ్యిందనే చెప్పాలి.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు స్వరూప్ తన మొదటి చిత్రం విషయంలో తీసుకున్న జాగ్రత్త రెండో సినిమా విషయంలో తీసుకోలేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా పేలవంగా రాసుకున్నాడు, అందువల్ల ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా, సెకండాఫ్ కి వచ్చేసరికి కథ-కథనం రెండూ గాడి తప్పాయి. అప్పటివరకూ చిన్నపాటి మూర్ఖులుగా చూపించిన ముగ్గురు పిల్లలు ఉన్నట్లుంది అమోఘమైన తెలివితేటలతో ఓ పెద్ద గ్యాంగ్ ను పట్టించే రేంజ్ లో ఎలివేట్ చేసిన విధానం వర్కవుటవ్వలేదు. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ సినిమాకి మైనస్ గా మారింది. అలాగే సినిమా ఎండ్ కూడా సోసోగా ఉండింది. కెమెరా, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ పర్వాలేదు.

విశ్లేషణ: ఒక థ్రిల్లర్ చిత్రం అది కూడా చిన్నపిల్లలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా అంటే ముఖ్యంగా ఉండాల్సింది పటిష్టమైన స్క్రీన్ ప్లే. అలాగే బోలెడన్ని లూప్ హోల్స్ కు సమాధానం చెప్పకుండా ముగించడం అనేది ఆడియన్స్ కు ఒక సంపూర్ణ చిత్రాన్ని చూసిన ఫీల్ ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా మంచి స్కోప్ ఉన్న థ్రిల్లర్ యావరేజ్ గా మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus