Akhanda 2: ‘అఖండ 2’లో నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

‘ఓజీ’ సినిమా కోసం తమన్‌ ప్రాణం పెట్టి పనిచేశాడు. ఆ సినిమాకు అంత హై రావడం వెనుక తమన్‌ సంగీతం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా రావడం, దాదాపు రన్‌ పూర్తయిపోయివడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్‌ ‘అఖండ 2: తాండవం’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు తమనే సంగీత దర్శకుడు అనే విషయం తెలిసిందే.

Akhanda 2

‘ఓజీ’ సినిమాకు ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నప్పుడు తమన్‌ ఎప్పుడూ ఒకే మాట చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని భాషల వారికి సమాధానం చెబుతుంది అని. ఆ తర్వాత ఆయన అంతటి కాన్ఫిడెన్స్‌ ఇస్తూ మాట్లాడిన సినిమా అంటే ‘అఖండ 2’ అనే చెప్పాలి. ‘అఖండ’ సినిమాలో తమన్‌ అందించిన నేపథ్య సంగీతం గుర్తున్నవారెవరూ ఇప్పుడు ‘అఖండ 2’ గురించి అంచనాలు పెట్టుకోకుండా ఉండరు. ఈ క్రమంలో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు తమన్.

గంభీరమైన స్వరంతో సంస్కృత శ్లోకాలు వినిపిస్తుండగా… నందమూరి బాలకృష్ణ ఆయుధం చేతపట్టి తెరపైన శత్రు సంహారం చేస్తుంటే ఎలా ఉంటుంది. ఆ శ్లోకాలను నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు పఠిస్తుంటే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమా కోసం అదే చేస్తున్నారు. సంస్కృత శ్లోకాలు చెప్పడంలో నిష్ణాతులైన పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దింపారు తమన్‌.

మిశ్రా సోదరులు చెప్పే సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు ‘అఖండ 2: తాండవం’ సినిమా నేపథ్య సంగీతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయని చిత్రబృందం చెబుతోంది. సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రధారులు. ఈ సినిమాను డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. నిజానికి దసరా సందర్భంగా ‘ఓజీ’ సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు.

ఇటు రూమర్స్‌ ఆగడం లేదు.. అటు అభిషేక్‌ థ్యాంక్స్‌ ఆగడం లేదు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus