Miss Shetty Mr Polishetty: పోస్ట్ పోన్ అయిన ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ మూవీ..!

‘నిశ్శబ్దం’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యువీ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తుండగా.. మ‌హేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో మహేష్ .. సందీప్ కిషన్ తో ‘రా రా కృష్ణయ్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. రధన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

‘లేడి లక్కు లేని లక్కు’ అనే పాటకి మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్ కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ముందుగా ప్రకటించారు. దీంతో అనుష్క ఫ్యాన్స్ అంతా సంతోషించారు. కానీ ఇప్పుడు ఇప్పుడు వారికి పెద్ద షాకిచ్చే న్యూస్ బయటకు వచ్చింది.

అదేంటి అంటే ఈ సినిమా ఆగస్టు 4 న రిలీజ్ కావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమవుతుందట. ఈ విషయాన్ని చిత్ర బృందమే ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అలాగే ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేస్తామని కూడా వారు ప్రకటించారు. ‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుండి రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై (Miss Shetty Mr Polishetty) భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus