మిషన్ ఇంపాజబుల్

హాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిలిమ్ సిరీస్ లో మొదటి వరసులో నిలిచే చిత్రం “మిషన్ ఇంపాజబుల్”. ఇప్పటికి ఈ సిరీస్ లో వచ్చిన అయిదు సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ సిరీస్ లో వచ్చిన ఆరో సినిమా “మిషన్ ఇంపాజబుల్ ఫాలౌట్”. ఇప్పటివరకూ వచ్చిన మిషన్ ఇంపాజబుల్ సిరీస్ లో బిగ్గెస్ట్ & మోస్ట్ కాస్ట్లీయస్ట్ ఫిలిమ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సంగతేంటో చూసేద్దాం..!!

కథ : ఈ సినిమా అర్ధమవ్వాలంటే ఈ సిరీస్ లో ముందు వచ్చిన అయిదు సినిమాలు చూడకపోయినా పర్లేదు కానీ.. పాత్రలతో కాస్త పరిచయం ఉంటే సరిపోతుంది. “ఐ.ఎమ్.ఎఫ్”ను అనధికార వర్గంగా ప్రభుత్వం పక్కన పెట్టేయడంతో.. తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈతేన్ హంట్ (టామ్ క్రూజ్) అండ్ టీం మీద పడుతుంది. అందుకోసం లూథర్ (శీయాన్ హారిస్) ప్లాన్ చేసిన వరుస బాంబు పేలుళ్లను ఆపడమే దారి అని తెలుసుకొంటాడు ఈతేన్. అయితే.. ఆ బ్లాస్ట్స్ జరగాలంటే కావాల్సిన ప్లూటోనియమ్ బాల్స్ ను టెర్రరిస్టుల చేతికి చిక్కకుండా చేసే ప్రయత్నంలో తన స్నేహితుల కోసం ఆ బాల్స్ ను పోగొట్టుకొంటాడు ఈతేన్. దాంతో.. సి.ఐ.ఏ ఈతేన్ కు ఆగస్ట్ వాకర్ (హెన్రీ కెవిల్)ను పార్ట్నర్ గా నియమించి.. ఈ బ్లాస్ట్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యతను అప్పగిస్తుంది.

అయితే.. ఆ ప్లూటోనీయం బాల్స్ తోపాటు లూధర్ కోసం కూడా చాలా గ్యాంగ్స్ & గవర్నమెంట్స్ వెతుకుతుంటాయి. ఈ ఇంపాజబుల్ మిషన్ ను ఈతేన్ హంట్ అండ్ టీం ఎలా సాధించారు, సక్సెస్ అయ్యారు అనేది “మిషన్ ఇంపాజబుల్ ఫాలౌట్” కథాంశం.

నటీనటుల పనితీరు : టామ్ క్రూజ్ ఎప్పట్లానే ఈతేన్ హంట్ పాత్రలో మెప్పించాడు. ఈ చిత్రంలో అతను నిజంగా కాలు విరిగినా కూడా పట్టించుకోకుండా కంటిన్యూ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జాకీచాన్ తరహాలో డూప్స్ లేకుండా టామ్ చేసే ఫైట్స్ ఆడియన్స్ ను అబ్బురపరుస్తాయి. ఇక బెంజీ పాత్రలో సైమన్ పెగ్ కామెడీని ఎంజాయ్ చేయకుండా ఎవరూ ఉండలేరు. అలాగే “రోగ్ నేషన్”లో మిస్టరీ లేడీగా కనిపించిన రెబెకా (లీసా) ఈ చిత్రంలో సపోర్టింగ్ రోల్ ప్లే చేయడం విశేషం.

అయితే.. టామ్ తర్వాత ఈ సినిమాలో తన నటన, లుక్స్ తో విశేషంగా ఆకట్టుకోన్న నటుడు హెన్రీ కెవిల్. “సూపర్ మేన్”గా ప్రపంచం మొత్తం విశేషమైన అభిమానులను సంపాదించుకొన్న హెన్రీ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేయడం అనేది సాహసమానే చెప్పాలి. అయితే.. ఆ పాత్రలో హెన్రీ అద్భుతంగా ఒదిగిపోయాడు. మనోడి పాత్రకి ఉన్న లేయర్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేయడం కూడా ఖాయం.

వీటన్నిటికంటే ముఖ్యంగా ఈతేన్ హంట్ ప్రేయసి జూలియా (మిచెల్లీ మోనాఘన్) క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇవ్వడం “మిషన్ ఇంపాజబుల్” సిరీస్ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ మాత్రమే కాదు.. క్లైమాక్స్ లో ఈతేన్ & జూలియా ఒకర్నొకరు హత్తుకొని.. వారి శ్వాసను అనుభూతి చెందడం అనేది బెస్ట్ సీన్ ఆఫ్ ది ఫిలిమ్.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు క్రిష్టోఫర్ మెక్వరీన్ తన మునుపటి చిత్రం “రోగ్ నేషన్”లో చేసిన తప్పులను బాగా అర్ధం చేసుకొని.. సినిమాలో డ్రామా కంటే ఎక్కువగా యాక్షన్ కి, ఎమోషన్స్ కి వేల్యూ ఇవ్వడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. 148 నిమిషాల సినిమాలో ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. అంత ఆసక్తికరంగా రాసుకొన్నాడు కథనాన్ని. ముఖ్యంగా క్లైమాక్స్ లో జూలియాను ఇన్వాల్వ్ చేసిన తీరు, లండన్ ఎపిసోడ్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం యాక్షన్ మూవీ లవర్స్ తోపాటు “మిషన్ ఇంపాజబుల్” సిరీస్ ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో సంతుష్టులను చేస్తుంది.

సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ ఇలా ప్రతి ఒక్క అంశం అద్భుతంగా సెట్ అయ్యాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ లు అయితే.. ఈమధ్యకాలంలో వచ్చిన చాలా హాలీవుడ్ సినిమాలకంటే వందరెట్లు బెటర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ రియలిస్టిక్ స్తంట్స్ కావడంతో.. ప్రతి ఒక్క ఫైట్ ప్రేక్షకుల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కి తీసుకొచ్చేస్తుంది.
విశ్లేషణ : ట్రైలర్ లో వినిపించిన రాకింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్కడా వినిపించలేదేంటబ్బా అనే ప్రశ్న తప్ప ఎలాంటి అసంతృప్తి లేకుండా ఒక అద్భుతమైన యాక్షన్ సినిమా చూశామన్న అనుభూతితో థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకొచ్చేలా చేసి.. కుదిరితే మళ్ళీ చూద్దాం అనుకొనేలా చేసిన సినిమా “మిషన్ ఇంపాజబుల్ ఫాలౌట్”. యాక్షన్ మూవీ లవర్స్ మరీ ముఖ్యంగా “మిషన్ ఇంపాజబుల్” సిరీస్ ఫ్యాన్స్ పొరపాటున కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా “మిషన్ ఇంపాజబుల్ ఫాలౌట్”.

రేటింగ్ : 3.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus