Mitraaw Sharma: హౌస్ మేట్స్ చేసిన పనికి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లో భోరున ఏడ్చిన మిత్రా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఐదోవారం ఆసక్తిగా మొదలైంది. నామినేషన్స్ అప్పుడే హౌస్ హీటెక్కిపోయింది. ఆపరేషన్ మిత్రా అన్నట్లుగా ఒక్కొక్కరు మిత్రాశర్మాని నామినేట్ చేస్తుంటే మిత్రా శర్మా తీసుకోలేకపోయింది. అంతేకాదు, తను గేమ్ ఎలా ఆడుతోందో ఒక్కొక్కరు క్లియర్ గా చెప్పారు. మహేష్ విట్టా అయితే, తను హౌస్ మేట్స్ గురించి ఇప్పటి వరకూ ఏమేమి కామెంట్స్ చేసిందో పూసగుచ్చినట్లుగా చెప్పాడు. దీంతో మిత్రాశర్మా చాలా బాధపడింది.

Click Here To Watch NOW

భోరున ఏడ్చింది. అంతేకాదు, హౌస్ లో అందరూ వ్యతిరేకం అవ్వడం, మిత్రాని దూరం పెట్టడం అనేది కూడా తీసుకోలేకపోయింది. ఒకవైపు అరియానా మిత్రాపై జాలి చూపిస్తూ అన్ని పనులు చేస్తూ ధైర్యం చెప్తోంది. అన్నం కూడా తినిపిస్తోంది. అయినా కూడా మిత్రా డల్ గా ఒక మూలన కూర్చుండి పోతోంది. హౌస్ లో ఎవ్వరితోనూ కలవడం లేదు. నిజానికి నామినేషన్స్ అప్పుడు అఖిల్ మిత్రాని టిష్యూ పేపర్లే ఎక్కువగా వాడుతున్నావని, గేమ్ ఆడట్లేదని చెప్పాడు.

టిష్యూలపై బాత్రూమ్ లో కూర్చుని ఏదో ఒకటి రాస్తూ హౌస్ మేట్స్ కి ఇస్తున్నావని అది కరెక్ట్ గేమ్ కాదని చెప్పాడు. అలాగే ప్రతి హౌస్ మేట్ గురించి ఏదో ఒకటి రాసి చూపిస్తున్నావని దానివల్ల నువ్వు గేమ్ లో కనిపించడం లేదని హౌస్ మేట్స్ మిత్రాకి చెప్పారు. ఇది వార్నింగ్ లాగా అనిపించింది. అంతేకాదు, తన గేమ్ సీక్రెట్ కూడా బయటపడిపోయిందని మిత్రా బాధపడిపోయింది. హౌస్ మొత్తం కావాలనే కక్ష్య గట్టి మరీ ఇలా చేశారని ఫీల్ అయ్యింది. ఇక్కడే బిగ్ బాస్ పర్సనల్ గా మిత్రాని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు.

మిత్రా శర్మాతో బిగ్ బాస్ మాట్లాడారు. బిగ్ బాస్ గొంతు వినగానే భోరున ఏడ్చింది మిత్రా. తను హౌస్ లో ఉండలేకపోతున్నానని, ఎవ్వరూ కూడా తన గేమ్ ని అర్ధం చేసుకోవట్లేదని, ఇప్పటి వరకూ చాలా మాటలు పడ్డానని బాధపడింది. ఫేక్ అన్నారు, నెగిటివ్ అన్నారు, అబద్దాలు అన్నారు, ఇలా చాలా మాటలు అంటూ టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అయ్యింది. అంతేకాదు, నన్ను బయటకి పంపించేయమని, ఇంటికి వెళ్లిపోతానని ప్రాధేయపడింది. భోరున ఏడ్చింది. దీంతో బిగ్ బాస్ ఆమెలో ధైర్యం కలిగించే నాలుగు మాటలు చెప్పారు. నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నావని, ఇలాగే కొనసాగించమని ఊరట ఇచ్చారు.

చాలాసేపు కన్ఫెషన్ రూమ్ లోనే ఉండిపోయిన మిత్రా శర్మా ఆ తర్వాత కాస్త శాంతించింది. బిగ్ బాస్ మాటలకి కొద్దిగా ఉపశమనం పొందింది. మిత్రా శర్మా ఆటని పరిశీలిస్తే టాస్క్ లలో పెద్దగా పెర్ఫామన్స్ ఇవ్వలేదు. అలాగే, బిగ్ బాస్ నామినేషన్స్ నుంచీ సేఫ్ అయ్యే ఛాలెంజస్ లో కూడా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడలేకపోయింది. బెలూన్స్ గేమ్ లో పూల్ లోకి దిగి మరీ తన బెలూన్ ని కాపాడుకున్నా కూడా యాంకర్ శివ వెళ్లి పగలగొట్టేశాడు. దీంతో గేమ్ లో నుంచీ అవుట్ అయ్యింది మిత్రా. మరి ఈసారి నామినేషన్స్ లో సేఫ్ అవుతుందా ? నిజంగానే ఇంటికి వెళ్లిపోతుందా అనేది ఆసక్తికరం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus