Mohan Babu, Allu Arjun: మోహన్ బాబు కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ అంచనాలకు మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాలో “ఇదీ నా కాలే ఇది కూడా నా కాలే” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయింది. బాలీవుడ్ లో కూడా పుష్ప ది రైజ్ తో బన్నీకి క్రేజ్ పెరగడం గమనార్హం. పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.

Click Here To Watch

అయితే ప్రముఖ నటులలో ఒకరైన మోహన్ బాబు తాజాగా పుష్ప మూవీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. పుష్ప సినిమా పేరును ప్రస్తావించకపోయినా ఆయన కామెంట్లు వింటే పుష్ప సినిమా గురించే చెప్పారని అర్థమవుతుంది. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. గంటన్నర నిడివి ఉన్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టికెట్స్ బుకింగ్ జరగడం లేదు. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

అయితే మోహన్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేక్షకుల టేస్ట్ మారిందని సినిమాల విషయంలో ఆడియన్స్ ఇచ్చే తీర్పు గమ్మత్తుగా ఉంటోందని అలా అని ప్రేక్షకులను పూర్తిగా నిందించనని మోహన్ బాబు అన్నారు. కొన్ని సినిమాల్లో కాలు పైన వేశాను తీసేయమంటావా, చెయ్యి అక్కడ వేశాను తీసెయ్యాలా అనే సీన్స్ వస్తున్నాయని మోహన్ బాబు కామెంట్లు చేయడం గమనార్హం. మోహన్ బాబు చేసిన ఈ కామెంట్లు పుష్ప సినిమా గురించే అని సులభంగానే అర్థమవుతోంది.

హీరోల పారితోషికాల గురించి తాను మాట్లాడనని మార్కెట్ ను బట్టి హీరోలు రెమ్యునరేషన్ ను తీసుకుంటారని మోహన్ బాబు వెల్లడించారు. ఇండస్ట్రీ కుటుంబంలా లేదని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. విష్ణు ఏ పని చేసినా ఆ పనిని వివాదం చేస్తున్నారని మోహన్ బాబు వెల్లడించారు. మోహన్ బాబు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus