కామన్ మ్యాన్ ఎఫెక్ట్.. మోహన్ బాబుకు జరిమానా!

  • February 18, 2021 / 10:21 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) నటుడు మంచు మోహన్ బాబుకు జరిమానా విధించింది. జూబ్లీ హిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన ఇంటి ముందు ప్రకటన కోసం అనధికార బిల్‌బోర్డ్ నిర్మించినందుకు గురువారం లక్ష రూపాయల జరిమానా విధించారు. సోషల్ మీడియా ద్వారా ఒక నెటిజన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పిర్యాదు అందిన వెంటనే, GHMC యొక్క ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ మరియు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EV&DM) విభాగం స్పందించింది. 15 అడుగుల ఎత్తులో ఉన్న అనధికార బిల్‌బోర్డ్‌పై చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 17న, నటుడి ఇంటి ముందు అక్రమ బ్యానర్ గురించి ఫిర్యాదుదారుడు ఈవీ అండ్ డిఎం బృందానికి ట్వీట్ చేశాడు. దీంతో జిహెచ్‌ఎంసి స్పందిస్తూ.. చట్టంలోని సెక్షన్లు 420, 421 కింద ఇది నేరమని ఇవి అండ్ డిఎం పేర్కొంది.

గతంలో అధికారులు కొంతమంది సెలబ్రెటీలపై కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నారు. రూల్స్ ఎవరు అతిక్రమించినా కూడా చర్యలు తప్పవని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఇంకా ఏ విధంగాను స్పందించలేదు. ప్రస్తుతం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్నాడు.


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus