మంచు మోహన్ బాబుకు నటుడిగా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా మోహన్ బాబు నటించిన సినిమాలేవీ ప్రేక్షకాదరణ పొందడం లేదు. యమదొంగ తర్వాత మోహన్ బాబుకు ఆ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన పాత్ర లేదనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన సన్నాఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబుపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ ను ఎదుర్కొన్నారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి మోహన్ బాబు పోటీ చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తాజాగా మోహన్ బాబు చంద్రబాబుతో భేటీ కావడంతో రాజకీయాల కోసమే ఆయన భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబుకు జగన్ సన్నిహితుడు అయినప్పటికీ 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ నేత గోనె ప్రకాశ్ రావు మోహన్ బాబు చంద్రగిరి నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధమైందని కామెంట్లు చేయడం గమనార్హం. మోహన్ బాబు నిజంగానే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మోహన్ బాబు కొడుకులలో ఒకరైన మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి ప్రాజెక్ట్ ను ప్రకటించగా ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. మోహన్ బాబు కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మోహన్ బాబు రాజకీయాలపై దృష్టి పెడితే రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.