ఈ నెల 19వ తేదీన మంచు మోహన్ బాబు పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. తిరుపతిలో తన పుట్టినరోజు వేడుకలను మోహన్ బాబు ఘనంగా జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన లైఫ్ అంతా కష్టాలమయమైందని మోహన్ బాబు తెలిపారు. ఏడేళ్ల పాటు తిండి లేక ఇబ్బందులు పడ్డానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కారు షెడ్ లో ఉంటూ రెండు జతల బట్టలతో తిరుపతి నుంచి మద్రాస్ కు వచ్చానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
దాసరి నారాయణరావుగారు తనను మోహన్ బాబుగా ప్రేక్షకులకు పరిచయం చేశారని ఆయన వెల్లడించారు. లైఫ్ లో ప్రతి నిమిషం ముల్లబాటగా ఉండేదని మోహన్ బాబు పేర్కొన్నారు. తాను ఎంతో మందికి ఉపయోగపడ్డానని అయితే తనకెవరూ ఉపయోగపడలేదని మోహన్ బాబు అన్నారు. తాను ఎన్నో రకాలుగా మోసపోయానని ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని లైఫ్ అంటే ఏంటో ఇప్పుడే తెలుస్తోందని మోహన్ బాబు కామెంట్లు చేశారు.
తనచేత ఎంతోమంది పొలిటీషియన్స్ వర్క్ చేయించుకున్నారని మోహన్ బాబు తెలిపారు. గురువుగారు జీవితమే ఒక నాటకమని చెప్పారని మోహన్ బాబు కామెంట్లు చేశారు. లైఫ్ లో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఎవరికీ కానీ రాకూడదని అనుకుంటానని మోహన్ బాబు వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే నన్ను రాజ్యసభకు పంపించారని మోహన్ బాబు తెలిపారు.
శ్రీ విద్యానికేతన్ 30 సంవత్సరాల కష్టం అని మోహన్ బాబు వెల్లడించారు. మనిషి స్వార్థజీవి అని మోహన్ బాబు తెలిపారు. మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు తనను మోసం చేశారని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తో మోహన్ బాబుకు బంధుత్వం ఉన్నప్పటికీ వైసీపీ గురించి మోహన్ బాబు ఎక్కడా మాట్లాడటం లేదు.