టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు హీరోగా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. మోహన్ బాబు తన వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్ ని ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం చేశాడు. వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోలు రాణిస్తున్నారు. తాజాగా మంచి విష్ణు హీరోగా “జిన్నా” సినిమాలో నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.
చోటా కె నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించగా.. సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు హాజరయ్యి తన కొడుకు మంచు విష్ణు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో విష్ణు తనని తక్కువగా మాట్లాడమని చెప్పాడని… ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు.
ఇలా కొడుకు తండ్రిని తక్కువ మాట్లాడమని చెప్పాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే మంచు విష్ణు అలా అనటానికి గల కారణం గురించి కూడా వివరించాడు. ఈ క్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ..’ఎన్టీఆర్, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ.. ఇలా ఎందరో హీరోల వేడుకల్లో పాల్గొని మాట్లాడాను. చివరికి అబ్దుల్ కలాం మా విద్యా సంస్థకు వచ్చినప్పుడూ కూడా ‘ఇన్ని నిమిషాలే మాట్లాడాలి’ అని ఎవరూ నాకు చెప్పలేదు.
కానీ, విష్ణు నన్ను ఈ రోజు తక్కువగా మాట్లాడమని చెప్పాడు. ఆ మాట విని షాక్ అయ్యా. అయినా ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. కన్న బిడ్డలను పదిమందిలో పొడగకూడదంటుంటారు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు నటన గురించి నటీనటులు , సాంకేతిక నిపుణులు చెప్పిన తర్వాత నేను మాట్లాడటానికి ఏముంది అంటూ చెప్పుకొచ్చాడు.