Chiranjeevi: ఆ వార్తల గురించి క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అయితే చిరంజీవి గురించి ఇండస్ట్రీలో కొన్ని రూమర్లు ఉన్నాయి. చిరంజీవి కథ విషయంలో వేలు పెడతారని గతంలో పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆచార్య సినిమా విడుదలైన సమయంలో ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరగడం గమనార్హం.

అయితే ప్రముఖ దర్శకులలో ఒకరైన మోహన్ రాజా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ ప్రచారానికి చెక్ పెట్టారు. చిరంజీవి సినిమా కథలో, సినిమాలో జోక్యం చేసుకుంటారని ఎవరైనా చెబితే కొడతానని మోహన్ రాజా అన్నారు. చిరంజీవి అనుభవాన్ని మనం వినియోగించుకోకపోతే మనం ఫూల్స్ అవుతామని మోహన్ రాజా కామెంట్లు చేశారు. ప్రతి అంశంలో చిరంజీవి ఇన్ పుట్ తీసుకోవడం వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.

మోహన్ రాజా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో మోహన్ రాజా మరో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి రీమేక్ సినిమాతో కాకుండా స్ట్రెయిట్ సినిమాను మోహన్ రాజా చిరంజీవితో తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి మోహన్ రాజా కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

చాలామంది స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే మోహన్ రాజా రెమ్యునరేషన్ కూడా తక్కువేనని సమాచారం. నాగార్జున మోహన్ రాజా కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నాగ్ వందో సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus