మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడిలో కొత్త పాయింట్ బయటికొచ్చింది. ఇన్నాళ్లూ ‘మా’కు శాశ్వత భవనం ఎందుకు లేదు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. దానిని ప్రధానమైన పాయింట్‌గా తీసుకొని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీదారులు సిద్ధమవుతున్నారు. అయితే ‘భవనం ఎందుకు?’ అనే మాటలు కొందరి నోట వినిపిస్తున్నాయనుకోండి. అయితే ఇక్కడే మంచు మోహన్‌బాబు ఓ ట్విస్ట్ ఇచ్చారు. ‘‘మా’ భవనం కొని అమ్మేసారెందుకు?’ అని కొత్త చర్చకు తెరలేపారు?
‘మా’ ఎన్నికల విషయం తెల్చడానికి ఇటీవల ‘మా’ క్రమశిక్షణ సంఘం నాయకులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీటింగ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ‘‘ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎవరికి వారే యమునా తీరే. యథారాజా తథా ప్రజా. అందరూ మేధావులు. ఒకరిని అనే స్థితిలో మనం లేము’’ అంటూ ‘మా’ నడుస్తున్న విధానం, వ్యవహారం గురించి మోహన్‌బాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇదంతా ‘మా’ భవనం గురించే అని సమాచారం.
‘‘గతంలో ‘మా’ కోసం ఓ బిల్డింగ్ కొని, దాన్ని అతి తక్కువ ధరకు అమ్మడం ఎంత వరకూ సమంజసం అన్నది ఒక్కరైనా ఆలోచించారా? ’’ అని మోహన్‌బాబు ప్రశ్నించారట. ఒక భవనం అమ్మేసి, మళ్లీ ఇప్పుడు కావాలనడం ఎంతవరకు కరెక్ట్… దీనిపై ఎవరైనా మాట్లాడారా? దీనికి ఎవరైనా సమాధానం చెబుతారా? అని వరుస ప్రశ్నలు వేశారు మోహన్‌బాబు. అంతేకాదు ఈ వ్యవహారం తన మనసును కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారట.
‘మా’ భవనాన్ని ఒక రూపాయి కొని, అర్ధ రూపాయి అమ్మేస్తారా? అంటూ తక్కువ ధరకు అమ్మేసిన విధానం గురించి వ్యంగ్యంగా చెప్పుకొచ్చారట మోహన్‌బాబు. దాంతోపాటు కుటుంబం గొప్పలు చెప్పుకున్న వారి గురించి మోహన్‌బాబు మాట్లాడారట. నటనలో గొప్పవారైనందరూ నా ఫ్యామిలీ గొప్పంటే.. నా కుటుంబం గొప్ప అని కబుర్లు చెప్పుకుంటున్నారు అని విమర్శించారట. అయితే ఇక్కడ అందం ఆ భగవంతుడి ఆశీస్సులతో బతుకుతున్నాం. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అని సూచించారట.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!