మరోసారి మోహన్ లాల్‌ను తీసుకొస్తున్న కొరటాల!

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కి ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. గతంలో తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన ‘మనమంతా’, అలానే కొరటాల శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రాలలో మోహన్ లాల్ నటించారు. ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ పాత్ర హీరో పాత్రకి ధీటుగా ఉంటుంది. సినిమాకి ఆయన రోల్ హైలైట్ గా నిలిచింది. ఆయన్ని మరిన్ని తెలుగు సినిమాల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకున్నారు కానీ ఆయన తెలుగులో మరే సినిమా సైన్ చేయలేదు.

కొంత గ్యాప్ తరువాత మళ్లీ మోహన్ లాల్ తెలుగులో ఓ భారీ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘జనతా గ్యారేజ్’ సినిమాను రూపొందించిన కొరటాల శివనే మరోసారి ఆయనతో తెలుగు సినిమాకి సైన్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను రూపొందిస్తోన్న కొరటాల.. దీని తరువాత అల్లు అర్జున్ హీరోగా సినిమాను మొదలుపెట్టనున్నారు.

ఈ ఏడాదిలోనే సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయ నేపథ్యంలోనే సాగే ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను మోహన్ లాల్ తో చేయించాలని కొరటాల పట్టుదలతో ఉన్నాడట. మోహన్ లాల్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని.. ఈ సినిమాకి ఆయన అంగీకరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus