అనుకున్నవన్నీ…ఆవిరి అయిపోతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు జనతా గ్యారేజ్ పై ఎన్నో అసలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ సౌంత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తాడు అన్నంత ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పటివరకూ తెలుగులో టాప్ స్పీడ్ లో దూసుకు వెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాతో మలయాళంలో కూడా దుమ్ము దులుపుతాడు అని అందరూ ఆశించారు. అభిమానులైతే ఎన్టీఆర్ ని సౌంత ఇండియన్ బెస్ట్ హీరోగా చూడాలి అని ఆశపడ్డారు… కానీ ఆ ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి..దానికి కారణం మోహన్ లాల్…అదేంటి జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ చాలా ప్లస్ కదా అనుకుంటే అందరూ పప్పులో కాలేసినట్లే….విషయంలోకి వెళితే…జనతా గ్యారేజ్ సినిమా మలయంలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే…అయితే అక్కడ మాత్రం ఎన్టీఆర్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు మోహన్ లాల్.
మలయాళంలో మొదట్నుంచి ఇది మోహన్ లాల్ సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన్నే ముందు పెట్టి ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లలో ఆయనే నిండిపోతున్నారు. టీజర్లో సైతం ఆయనే లీడ్ తీసుకున్నారు. ఇప్పటిదాకా ఎన్టీఆర్ మలయాళ వెర్షన్ ప్రమోషన్లలో ఎక్కడా హైలైట్ అవ్వలేదు. అసలే ఎన్టీఆర్, బన్నీలాగా మళయాళ మార్కెట్ ని శాశిస్తాడేమొ అని అందరూ అనుకున్న సమయంలో మోహన్ లాల్ అండ ఎన్టీఆర్ కాంబినేషన్ బాగా కలిసొస్తుందని అని ఆలోచించిన సమయంలో ఇలా మోహన్ లాలే ఎన్టీఆర్ కు అడ్డంకిగా మారతాడు అని ఎవ్వరూ ఊహించలేదు. మరి ఎన్టీఆర్ క్రేజ్ ఎంతవరకూ పెరుగుతుందో సినిమా విడుదల అయ్యే వరకూ చెప్పలేము.