మరోసారి పెద్ద చర్చకు దారి తీసిన మోనాల్ కామెంట్స్..!

‘బిగ్ బాస్4’ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో మోనాల్ ముందుంటుంది.మరో కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ తో ప్రేమాయణం అలాగే విన్నర్ అభిజీత్ తో హగ్గులు, ముద్దులతో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈమెను తిట్టుకుని ఉండచ్చు కానీ.. కుర్ర కారు మాత్రం మోనాల్ గజ్జర్ గ్లామర్ కు ఫిదా అయిపోయారు. అలాగే అఖిల్- మోనాల్ పెయిర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. వీళ్ళు హౌస్ నుండీ బయటకి వచ్చాక..

ఏదైనా మూవీలో కలిసి నటిస్తే బాగుంటుందని అప్పట్లో చాలామంది సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకున్నారు. వారు కోరుకున్నది త్వరలోనే నిజం కాబోతుంది.వీరిద్దరూ కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్‌లో జంటగా కనిపించనున్నారు.త్వరలోనే ఓటిటి వేదికగా ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మోనాల్ ఓ ఇంటర్వ్యూ‌లో ప్రస్తావిస్తూ.. “ఈ వెబ్ సిరీస్‌లో అఖిల్ నటిస్తున్నాడని చెప్పేసరికి.. వెంటనే ఓకే చెప్పేసాను.

బిగ్ బాస్‌ హౌస్ లో ఉన్నప్పుడు మా ఇద్దరి పెయిర్‌కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మా ఇద్దరినీ కలిపి స్క్రీన్‌పై చూడాలనుకున్నారు. వాళ్ళని ఈ వెబ్ సిరీస్ బాగా ఆకట్టుకుంటుంది. గుజరాత్ నుండీ హైదరాబాద్‌కు జాబ్ కోసం వచ్చిన ఓ అమ్మాయికి.. విలేజ్ నుండీ సిటీకి వచ్చిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయికి మధ్య నడిచే ప్రేమ కథ ఇది” అంటూ చెప్పుకొచ్చింది మోనాల్. భాస్కర్ బంటుపల్లి ఈ వెబ్ సిరీస్‌ ను డైరెక్ట్ చేసాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus