‘కూలీ’ సినిమాలోని ‘మోనిక..’ పాటను వింటూ, చూస్తూ మైమరచిపోతున్నారు కుర్రకారు. రెడ్ బ్యూటీలో పూజా హెగ్డే చేసిన డ్యాన్స్, స్కిన్ షో పవర్ అది. ఇక అభిలాషిని గొంతు దానికి బెస్ట్ యాడ్ ఆన్. అయితే నిన్నటితరం వారికి అందులో ‘మోనికా బెలూచీ’ అనే పేరు వేరే లెవల్ వైబ్‌ను ఇస్తోంది. ఎందుకంటే మోనికా బెలూచీ అంటే ఆ తరానికి ఓ ఎమోషన్ మరి. ఈ 60 ఏళ్ల ఇటాలియన్ మోడల్, నటి ఒకప్పుడు కుర్రకారు గుండెల్ని పిండేసిన అందం మరి. దీంతో కొంతమంది ‘మోనిక..’ సాంగ్‌కి ఆమె ఇన్‌స్టా అకౌంట్స్‌ని ట్యాగ్ చేస్తున్నారు.
మోనికా బెలూచీ మా మోనికను ఓసారి చూడు.. అంటూ సజెషన్స్ కూడా పంపించారు. ఇప్పుడు వారందరి కోరిక నెరవేరిందట. ఆమె ఆ పాటను చూసి రియాక్ట్ కూడా అయిందట. ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ విషయాన్ని తెలిపారు. ‘కూలీ’ సినిమాలోని ‘మోనికా..’ సాంగ్ మోనికా బెలూచీకి చేరడంలో ఆమెనే కీలక పాత్ర పోషించారట. మోనికాకు పరిచయం ఉన్న ఒక ఫిలిం ఫెస్టివల్ హెడ్‌కు అనుపమ ఈ పాటను షేర్ చేశారట. మోనికాకు ఆ వ్యక్తి పాటను షేర్ చేశారట. ఆ తర్వాత పాట మోనికా బెలూచికి బాగా నచ్చినట్లు మెసేజ్ అనుపమకు వచ్చిందట.
మోనికా బెలూచికి ట్రిబ్యూట్‌గా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ పాటను సినిమాలో పెట్టారు. అనిరుధ్‌కి కూడా మోనికా మీద ఆరాధన భావం ఉందట. ఇక పాటలో అయితే ఇటు పూజా హెగ్డే అందాలతో అదరగొట్టగా.. నటుడు సౌబిన్ షాహిర్ తనదైన స్టెప్పులతో ఇరగదీశాడు. ఇప్పుడు ఏకంగా పాట ఒరిజినల్ మోనికకే నచ్చిందంటే చిన్న విషయం కాదు. సినిమాకు ప్రస్తుతం హైప్‌ను తీసుకురావడంలో ఈ పాటకు కీలక పాత్ర. మరి పాట తీసుకొచ్చిన హైప్ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. రేపు ఉదయానికల్లా సినిమా మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ‘వార్ 2’తో అయితే పోటీ రంజుగా సాగుతోంది.