హైదరాబాద్‌లో సినిమాల షూటింగ్‌లు జరగడం సర్వసాధారణం. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరణలు లేక నగరం బోసిపోయింది. ఎటు చూసినా చిత్రీకరణ జరిగే భాగ్యనగరి… మళ్లీ ఇన్నాళ్లకు ‘చిత్ర’నగరిగా మారిందిట. అవును నగరంలో స్టూడియోలు, షూటింగ్ స్పాట్‌లు వరుస చిత్రీకరణలతో కళకళలాడుతున్నాయి. పది కాదు, ఇరవై కాదు ఏకంగా 90కిపైగా చిత్రీకరణలు సాగుతున్నాయట. సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు… ఇలా రోజుకు మొత్తంగా 90 నుండి 100 వరకు చిత్రీకరణల వరకు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అందలుఓ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలు ఉన్నాయట. దాంతోపాటు ఆయా భాషల్లోని సీరియళ్లు, వెబ్‌సిరీస్లు కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నారట. షూటింగ్‌ల పరిస్థితి ఎలా ఉందంటే… నటులకు కావాల్సిన వ్యానిటీ వ్యాన్లు నగరంలో దొరకడం కష్టంగా మారిందట. ఇక హైదరాబాద్‌లో చిత్రీకరణలు పెరగడానికి కారణాలు చూస్తే… తమిళనాడులో లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు కేరళలో కేసులు సంఖ్య నానాటికీ పెరుగతోంది. కర్ణాటకలో షూటింగ్స్ పెట్టే పరిస్థితి అంతగా లేదు. దీంతో అందరి చూపు
హైదరాబాద్ మీద పడిదంటున్నారు. మరోవైపు ఇక్కడి పెద్ద పెద్ద హోటల్స్‌లో ధరలు బాగా తగ్గించారట. దీంతో ఖర్చు కూడా బాగా మిగులుతుందని దర్శకనిర్మాతలు హైదరాబాద్‌వైపు వచ్చేస్తున్నారట.