టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన ‘మోసగాళ్ళు’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించింది, ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది కూడా మంచు విష్ణునే. తన మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు. మొత్తం రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నా.. కనీసం అందులో సగం అయినా ఖర్చు చేసి ఉంటారా..? అని సినిమా చూసిన వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.15 కోట్లు ఫైనాన్స్ తీసుకొని చేసిందే అని తెలుస్తోంది. సాధారణంగా.. సినిమా విడుదలకు ముందే మొత్తం ఫైనాన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటారు.
సినిమాని అమ్ముకొని.. ఆ డబ్బులతో క్లియరెన్స్ తెచ్చుకుంటారు. కనీసం థియేటర్ల నుండి వచ్చిన అడ్వాన్స్ లతో అయినా.. ఫైనాన్షియర్లకు డబ్బు చెల్లిస్తారు. కానీ ‘మోసగాళ్ళు’ సినిమాని విష్ణు సొంతంగా విడుదల చేశాడు. అది కూడా మోహన్ బాబు సపోర్ట్ చేయడం వలనే అని సమాచారం. మోహన్ బాబు రంగంలోకి దిగి విష్ణుకి లైన్ క్లియర్ చేశారని టాక్. ఇప్పుడు చూస్తే.. థియేటర్ల నుండి అడ్వాన్స్ లు కూడా రాలేదు. కలెక్షన్స్ బాగుంటే.. ఫైనాన్షియర్లకు డబ్బులు కడదాం అనుకుంటే.. సినిమాకి ప్లాప్ టాక్ వచ్చేసింది.
వసూళ్లు కూడా బాగా డల్ గా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఫైనాన్షియర్లకు డబ్బు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత మోహన్ బాబుపై పడింది. అయితే పదిహేను కోట్ల మొత్తం చెల్లించడం అనేది ఆయనకి పెద్ద విషయమేమీ కాదు. కానీ ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ తో వచ్చే డబ్బుని ఫైనాన్షియర్లకు కట్టాలని విష్ణు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సరైన బేరం తగిలి కనీసం ఆ డీల్ అయినా.. మోసగాళ్ళను గట్టెక్కిస్తుందేమో చూడాలి!
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!