Most Eligible Bachelor : లేటెస్ట్ పోస్టర్ వెనుక అంత కథ ఉందా?

అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జి.ఎ2 పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌ పై బన్నీ వాసు,వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించింది.గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో రూపొందిన పాటలకు కూడా మంచి స్పందన లభించింది. దీంతో ఈసారి అఖిల్ హిట్టు కొట్టడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

కరోనా హడావిడి కనుక లేకపోతే గతేడాదే ఈ చిత్రం విడుదలయ్యేది. కానీ దాని వల్ల షూటింగ్ కు అంతరాయం కలగడంతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. మొన్నామధ్య ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ మంచి ఆఫర్ లేకపోవడంతో నిర్మాతలు థియేటర్ల వైపే మక్కువ చూపిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అక్టోబర్ 8న దసరా కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ పోస్టర్ ను కనుక గమనిస్తే.. అఖిల్ 7 రకాల విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తున్నాడు. సినిమాలో కూడా ఇలా 7 రకాల లుక్స్ తో అఖిల్ సందడి చేయబోతున్నట్టు ఈ పోస్టర్ స్పష్టం చేసింది. ఈ పోస్టర్ అఖిల్ అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus