Mounika Reddy: మా ప్రైవేట్ లైఫ్ మాకు ఉంటుంది.. విడాకుల వార్తలపై మౌనిక రెడ్డి కామెంట్స్!

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో రూపొందిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో కానిస్టేబుల్ గా నటించి బాగా పాపులర్ అయ్యింది మౌనికా రెడ్డి. ఈ సినిమాలో మొదటి 15 నిమిషాల పాటు జరిగే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. రానా కారణంగా సస్పెండ్ అయ్యే కానిస్టేబుల్ ఆమె కనిపిస్తుంది. విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో అలాగే ‘ధమాకా’ సినిమాలో రవితేజ చెల్లెలి పాత్రలో కూడా ఈమె నటించి మెప్పించింది.

సినిమాల్లోకి రాకముందు ఈమె పలు వెబ్ సిరీస్లలో నటించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, మౌనిక … సందీప్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్ళై ఏడాది కాకుండానే ఆమె విడాకులు తీసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి కారణం.. మౌనిక తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడమే అని చెప్పాలి. గతంలో సమంత, నిహారిక వంటి వారు కూడా విడాకులకు ముందు తమ ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు.

అందుకే వారి బాటలో మౌనిక రెడ్డి కూడా అడుగులు వేస్తుంది అనే చర్చ ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ వార్తల పై మౌనిక రెడ్డి అలాగే ఆమె భర్త స్పందించింది. ‘ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాం. మా పీఆర్ మంచి పనిచేశాడు. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు పెట్టాలో మాకు తెలీదు. మా ప్రైవేట్ లైఫ్ మాది’ అంటూ ఆమె (Mounika Reddy) పేర్కొంది. దీంతో విడాకుల రూమర్స్ కి మౌనిక ఫుల్స్టాప్ పెట్టినట్టు అయ్యింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus