బాలీవుడ్‌లో ఇయర్‌ ఎండింగ్‌ సినిమాలివే

మాయదారి కరోనా వచ్చి ఇలా అయిపోయింది కానీ… ఒకప్పుడు మన సినిమా పరిశ్రమ ఎలా ఉండేది. వారానికి కనీసం రెండు కొత్త సినిమాలు వచ్చేవి. నెలలో ఓ పెద్ద హీరో సినిమా వచ్చేది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఏ వుడ్‌ అయినా ఇలానే ఉండేది. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులు సద్దుమణుగుడుతంటంతో సినిమా రాక జోరందుకుంది. వచ్చే రెండు నెలల్లో ఐ మీన్‌ ఇయర్‌ ఎండింగ్‌లో బాలీవుడ్‌లో పెద్ద సినిమా బొనాంజా ఉండబోతోంది. అవేంటో చూసేయండి.

* ఎప్పుడో కరోనా తొలి వేవ్‌కి ముందు రెడీ అయిన చిత్రం అక్షయ్‌ కుమార్‌ ‘సూర్య వంశీ’. రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌ అతిథిపాత్రధారులు. అక్షయ్‌ సరసన కత్రినా కైఫ్‌ నటిస్తోంది. ఈ సినిమా నవంబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

* బాలీవుడ్‌ కామెడీ సినిమాల్లో ‘బంటీ ఔర్‌ బబ్లీ’కి మంచి పేరుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ వస్తోంది. సిద్ధాంత్‌ చతుర్వేదీ, శర్వరీ వాఘ్‌ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌, రాణీ ముఖర్జీ కీలక పాత్రధారులు. ఈ నెల 19న సినిమా రిలీజ్‌ అవుతోంది.

* బాలీవుడ్‌లో ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సినిమా ట్రైలర్‌ ‘సత్యమేవ జయతే 2’. జాన్‌ అబ్రహం త్రిపాత్రాభినయం చేస్తున్న యాక్షన్‌ సినిమా ఇది. మిలాప్‌ జవేరి రూపొందిస్తున్న ఈ సినిమా మీద పెద్దగా ఆశలు లేనప్పటికీ… జాన్‌ మీద అంతో కొంత నమ్మకం ఉంది. ఈ సినిమా నవంబరు 25న వస్తోంది.

* ఆయుష్‌ శర్మ, సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రధారులు రూపొందిన చిత్రం ‘అంతిమ్‌’. మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయుష్‌ శర్మ లుక్‌, సల్మాన్ స్టైల్‌ అండ్‌ స్వాగ్‌ ట్రైలర్‌ని హైలో కూర్చోబెట్టాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇదంతా నవంబరు సినిమాల గురించి… ఇప్పుడు డిసెంబరు సినిమాల సంగతి చూద్దాం!

* ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్‌లో ‘తడప్‌’గా తెరకెక్కిస్తున్నారు. అహాన్‌ శెట్టి హీరోగా రూపొందిన ఈ సినిమాలో తారా సుతారియా నాయిక. మిలన్‌ లుథిరా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబరు 3న విడుదలవుతోంది.

* డిసెంబరు 10న ‘చండీఘడ్‌ కరే ఆషికి’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరో ఆయుష్మాన్ ఖురానా. అభిషేక్‌ కపూర్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా… ఆయుష్మాన్‌ అక్కడ.

* బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న మరో చిత్రం ‘83’. ప్రపంచకప్‌లో భారత్‌ సాధించిన అతి పెద్ద విజయం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. కపిల్‌గా రణ్‌వీర్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus