Seema Haider: పాక్‌ మహిళ సీమా హైదర్‌పై సినిమా.. అంతా రెడీ అంటున్న నిర్మాణ సంస్థ!

పబ్‌జీ లవ్‌… గత కొన్ని నెలలుగా దేశంలో వైరల్‌ అవుతున్న విషయం ఇది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన ఈ విషయం గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని సినిమాగా రూపొందించాలని ఓ నిర్మాణ సంస్త ప్రయత్నాలుచేస్తోంది. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారిది. పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ నుండి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ గురించే ఈ సినిమా అంతా.

సీమా హైదర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి అమిత్‌ జానీ సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన అదనపు వివరాల కోసం అమిత్‌ జానీ ప్రయత్నాలు చేస్తున్నారు. సీమా హైదర్‌ ఈ ప్రేమకథ ఎలా మొదలైంది. భారతదేశానికి ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? అనే వివరాలు ఈ సినిమాలో చూపిస్తారట. అలాగే కొంతమంది అంటున్నట్లు సీమా నిజంగానే పాక్‌ ఏజెంటా? అనే విషయాలు సినిమాలో చూపిద్దామని అమిత్‌ జానీ అనుకుంటున్నారట.

సీమా హైదర్‌ (Seema Haider) గురించి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్నంగా ఈ సినిమాలో చూపించడానికి ప్లాన్స్‌ వేస్తున్నారు. ‘కరాచీ టు నోయిడా’ అనే పేరుతో ఈ చిత్రాన్ని జానీ ఫైర్‌ఫాక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ తెరకెక్కించనుంది. ఈ క్రమంలో సీమా జీవితం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఆమె మాజీ భర్త (గులాం హైదర్‌)ను సంప్రదించాలని సినిమా టీమ్‌ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే సీమా సోదరుడి గురించి కూడా వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారట.

ఒకవేళ గులాం భారత్‌కు రాలేకపోతే ఆయన ఉంటున్న సౌదీ అరేబియాకు రచయితను పంపిస్తామన జానీ చెప్పారు. నటీనటుల ఎంపిక త్వరలో పూర్తవుతుందని, సీమ ప్రయాణంలో కీలకమైన దుబాయిలోనే సినిమా చిత్రీకరణ ఉంటుంది అని జానీ తెలిపారు. పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్‌ సరిహద్దును దాటి భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టింది సీమా హైదర్‌.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus