Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లకే పరిమితం కాదని ఎన్నోసార్లు నిరూపించారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన స్ట్రాటజీ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఉత్తర భారతంలో పవిత్ర నగరంగా పేరొందిన వారణాసిలో ఒక్కసారిగా కనిపించిన భారీ హోర్డింగ్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎటు చూసినా ఒకే లైన్.. “2027 ఏప్రిల్ 7న థియేటర్లలో” అంతే, సినిమా పేరు లేదు, హీరో ఎవరు అన్న వివరాలూ లేవు.

Varanasi

ఈ సైలెంట్ హైప్‌నే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ హోర్డింగ్స్ ఫోటోలు వైరల్ కావడంతో “ఇది జక్కన్న మైండ్ గేమ్ కాదా?” అనే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వారణాసి అనే నగరాన్ని ఎంచుకోవడం వెనుక ఏదో లోతైన ప్లాన్ ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కేవలం తేదీతోనే అంచనాలను పెంచడం రాజమౌళి స్టైల్‌కు అచ్చుగుద్దినట్టు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్ కూడా షూటింగ్‌తో సమాంతరంగా సాగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రతో సినిమాకు మరింత బలం చేకూర్చనున్నారు.

మొత్తానికి, పేరు చెప్పకుండా తేదీతోనే హడావుడి చేయడం ద్వారా 2027 సమ్మర్‌కు ఒక భారీ సినిమా వస్తోందన్న సంకేతాలను ఈ హోర్డింగ్స్ ఇస్తున్నాయి. ఇది నిజంగానే ‘వారణాసి’కే సంబంధించినదా? లేక మరో సర్ప్రైజ్ దాగుందా? అనే ఉత్కంఠకు సమాధానం రావాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సిందే. అప్పటివరకు ఈ మిస్టరీ హోర్డింగ్స్ హైప్ కొనసాగడం ఖాయం.

Pawan Kalyan : తల్లి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పని తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus