మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూడాలి అంటే.. చేతికి చమురు వదలాల్సిందే. అది ఏ ఊరైనా, ఏ నగరమైనా, ఆఖరికి ఏ దేశమైనా టికెట్ రేట్లు భారీగానే ఉంటాయి. అయితే ఒక్కో టికెట్‌ను కేవలం రూ. 75కే ఇస్తున్నారు అంటే ఆసక్తికరమే కదా. కానీ థియేటర్ల యజమానులు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా ఆఫర్ ఇస్తున్నారు? అసలు ఇది సాధ్యమేనా? ఎక్కడ ఈ ఆఫర్ ఇస్తున్నారు… అనేది ఓసారి చూద్దాం.
అమెరికాలోని థియేటర్ యాజమాన్యాలు కలసి సెప్టెంబర్ 3ను ‘నేషనల్ సినిమా డే’గా నిర్ణయించాయి. ఈ మేరకు అక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాయి కూడా. అందులో భాగంగా సెప్టెంబర్ 3న టికెట్ రేటు కేవలం మూడు డాలర్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఆ రేటుకు అమ్మాయి. అమెరికాలో థియేటర్ సంఘాలు ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ మన దేశంలో సెప్టెంబర్ 16ను ‘నేషనల్ సినిమా డే’ను సెలబ్రేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆ రోజున టికెట్ ₹75కే విక్రయించనున్నట్లు తెలిపాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా కొన్ని రోజులు ఆగిపోయింది. ప్రాణ భయం, ఆరోగ్యం భయం… జనాలు ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో ఆ సమయంలో థియేటర్లు కూడా మూసేశారు. సుమారు ఏడాది తర్వాత జన జీవనం కాస్త గాడిలో పడింది. గతేడాది సెప్టెంబర్ 16న పూర్తి స్థాయిలో దేశమంతా థియేటర్లు తెరుచుకున్నాయి. అందుకే ఆ రోజును ‘నేషనల్ సినిమా డే’గా పండగ చేసుకుంటున్నారు. దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో రూ.75 టికెట్ రేట్‌తో సినిమాలు వేయనున్నారు.
ప్రస్తుతానికి దేశంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఆ రోజున రూ.75కే టికెట్లు అమ్మాలని నిర్ణయించాయి. బుక్ మై షో, పేటీయం వంటి యాప్స్ ద్వారా బుక్ చేస్తే కాస్త అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. నేరుగా థియేటర్ దగ్గర టికెట్ కొంటే రేటు తక్కువగా ఉంటుంది. మరి ఈ ఉత్సవం మల్టిప్లెక్స్‌లకే పరిమితం అవుతుందా? సింగిల్ థియేటర్స్ కూడా ఈ ₹75 కిందకు వచ్చి టికెట్లు అమ్మి పండగ చేస్తాయా అనేది చూడాలి.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర