ఈ ముగ్గురిలో విజయం ఎవరి సొంతం ?

వారాంతం వస్తుందంటే సాఫ్ట్ వేర్ ఇంజరీన్లు హాలీడేస్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో తెలియదు కానీ.. మూవీ లవర్స్ మాత్రం ఏం సినిమాలు విడుదలవుతున్నాయా అని ఎదురుచూస్తుంటారు. వారానికి కనీసం మూడునాలుగు కొత్త సినిమాలు చూడందే ముద్ద దిగని బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకోసమే ఈవారం మూడు తెలుగు సినిమాలు, ఒక ఆంగ్ల చిత్రం విడుదలవుతున్నాయి. రవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఇలియానా చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం కావడంతోపాటు.. “వెంకీ, దుబాయ్ శీను” లాంటి కామెడీ ఎంటర్ టైనర్స్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

అలాగే.. “బిచ్చగాడు”తో తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకొన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం “రోషగాడు” కూడా రేపే విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలతోపాటు హాలీవుడ్ నుంచి మోస్ట్ యాంటిసిపేటేడ్ “ఫెంటాస్టిక్ బీస్ట్స్” సీక్వెల్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూడు సినిమాల తర్వాత శనివారం విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పైరసీ ప్రింట్ రిలీజ్ అవ్వడంతో మంచి పబ్లిసిటీ దొరికింది. ఈ మూడు తెలుగు సినిమాల రిజల్ట్స్ సదరు హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే కాక దర్శకులకు కూడా చాలా కీలకం. మరి ఈ మూడు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుంది, ఎవరు బాక్సాఫీస్ పై హల్ చల్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus