తెలుపు, నలుపు రంగులతో వెండి తెరపై కదిలిన బొమ్మ మాటలు నేర్చుకుంది. రంగులు అద్దుకుంది. ఎన్నో హంగులను జోడించుకొని అందరినీ అలరిస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోను సినిమాలు కొత్తదనాన్నీ స్వీకరించాయి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో మార్పుకు నాంది పలికిన సినిమాలపై ఫోకస్…
డ్యూయల్ రోల్తెలుగు చిత్రపరిశ్రమలో కెమెరాతో మాయ చేయడం ఎప్పుడో మొదలయింది.1961 లో వచ్చిన ఇద్దరు మిత్రుల్లో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి డ్యూయల్ రోల్ పోషించారు. ఒకే తెరపై ఇద్దరు ఏఎన్నార్ లను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
ఈస్ట్ మన్ కలర్1963 వరకు తెలుగు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉన్నాయి. తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అమరశిల్పి జక్కన్న ఈస్ట్ మన్ కలర్ తో ప్రదర్శించబడింది.
కలర్ మూవీఈస్ట్ మన్ కలర్ నుంచి పూర్తి రంగుల చిత్రం కావడానికి మనకి ఎక్కువ సమయం పట్టలేదు. 1963 లోనే ఎన్టీఆర్, అంజలి నటించిన లవకుశ మూవీ రంగుల ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించింది.
సినిమా స్కోప్తెరమొత్తం కనిపించే బొమ్మ కొంత కుదించుకొని అందాన్ని అద్దుకుంది. అదే సినిమా స్కోప్. ఈ పద్దతిలో తెరకెక్కిన తొలి తెలుగు మూవీ అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష ఈ కొత్త టెక్నాలజీకి స్వాగతం పలికి హిట్ ని సొంతం చేసుకున్నారు.
70 ఎంఎం మూవీకృష్ణ సొంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాకి అనేక ప్రత్యేకతలున్నాయి. అందులో ప్రధానమైంది. తెర డబల్ అవ్వడం. అప్పటి వరకు తెలుగులో 35 ఎంఎం సినిమాలు వచ్చాయి. సింహాసనం 70 ఎంఎం మూవీగా చరిత్రలో నిలిచింది. ఈ సినిమాతో థియేటర్లలో తెరను మార్చాల్సి వచ్చింది.
డీటీఎస్ హంగులుతెలుగు సినీ రంగంలో సాహసోపేతమైన మార్పుకు స్వాగతించడానికి కృష్ణ ముందుంటారని తెలుగు వీర లేవరా సినిమాతో మారో మారు నిరూపించుకున్నారు. ఈ సినిమాతో తెలుగు వారికి కనుల విందు మాత్రమే కాదు.. వీనుల విందు చేశారు. ఈ చిత్రం డీటీఎస్ హంగులు జోడించుకుంది.
సైన్స్ ఫిక్షన్ మూవీపౌరాణిక, జానపద, సాంఘిక కథలతో తెలుగు సినిమాలు రూపుదిద్దుకునేవి. ఈ కథల బాటను బద్దలుకొట్టిన సినిమా ఆదిత్య 369 . బాలకృష్ణ నటించిన ఈ సినిమా తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ గా రికార్డు సృష్టించింది.
హై సీజీఐ1990 నుంచి తెలుగు సినిమాల్లో అక్కడక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ ని జోడిస్తూ ఉన్నారు. కానీ తొలి సారి అత్యధిక స్థాయిలో సీజీఐ చేసిన మూవీ అమ్మోరు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు.
దిశను మార్చిన మూవీతెలుగు సినిమా కొన్ని గీతాలను గీసుకొని ఉంది. ఆ బార్డర్స్ అన్నింటినీ రాంగోపాల్ వర్మ శివ సినిమాతో మార్చివేశారు. కథ, లైటింగ్, మ్యూజిక్, ఫైట్స్.. ఇలా అనేక అంశాల్లో దర్శకుల ఆలోచనని ఈ సినిమా మార్చివేసింది. ఇక్కడి నుంచి తెలుగు సినిమా రూట్ మారిపోయింది.
భారీ బడ్జెట్తెలుగు సినిమా వంద కోట్లు కలక్షన్స్ సాధించడం గొప్పగా చెప్పుకునే సమయంలో 150 కోట్లతో బాహుబలి సినిమా నిర్మితమైంది. అలాగే బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మితమై 1800 కోట్లను వసూలు చేసింది. తెలుగు సినిమా స్థాయిని ఎన్నోరెట్లు పెంచిన మూవీగా బాహుబలి రికార్డు నెలకొల్పింది.