సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది. ఫ్యామిలీ మెన్ క్రియేటర్ రాజ్ నిడిమోరునే సమంత 2వ పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ కారణంగానే నాగ చైతన్య సమంత విడిపోయారు అనే ప్రచారం.. సమంత- రాజ్..ల వివాహంతో కన్ఫర్మ్ చేసినట్టు అయ్యింది. ఈ సందర్భంగా గతంలో నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
గతంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. “నా జీవితంలో ఏదైతే జరిగింది. అది చాలా మంది జీవితంలో కూడా జరిగింది. అది నా ఒక్కడికే జరిగింది అనడానికి లేదు. నన్ను క్రిమినల్ గా ఎందుకు ప్రోజెక్ట్ చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఈ మాట అందరినీ ఉద్దేశించి అనడం లేదు.. నాకు ఎవ్వరినీ నొప్పించాలని లేదు. నేను ఒక రిలేషన్ షిప్ ని బ్రేక్ చేయాలంటే.. వెయ్యి సార్లు ఆలోచిస్తాను.
నేను కూడా బ్రోకెన్ ఫ్యామిలీ నుండే వచ్చాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఇద్దరం అలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. తర్వాత మా దారులు మేము చూసుకున్నాం. కానీ అది ఒక హెడ్ లైన్లా అయిపోయింది. తర్వాత టాపిక్ లా అయ్యింది, గాసిప్..లా అయ్యింది,చివరికి అదొక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇందులో నాగ చైతన్య చేసిన హానెస్ట్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి. అతని తల్లి లక్ష్మి.. నాగ చైతన్య తండ్రి నాగార్జునతో విడాకులు తీసుకుంది. తర్వాత నాగార్జున..అమలని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ బాధతోనే చైతన్య కూడా పెరిగుండొచ్చు. కాబట్టి అంత ఈజీగా సమంతని ఎందుకు వదులుకుంటాను.. 1000 సార్లు అలోచోనుంచే ఈ నిర్ణయం తీసుకున్నాను అనే అర్ధం వచ్చేలా చైతన్య చెప్పడం జరిగింది.