‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ ‘డార్లింగ్’ తో హిట్ కొట్టి ఊపిరి పీల్చుకున్నాడు. అదే టైములో ప్రభాస్ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఆ మూవీ తర్వాత ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు.కాజల్, తాప్సి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 2011 వ సంవత్సరంలో ఏప్రిల్ 22న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుని ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.’మున్నా’ తో ప్రభాస్ కు ఓ హిట్టు బాకీ పడ్డాడు నిర్మాత దిల్ రాజు. ఆ లోటుని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తో తీర్చుకున్నాడు. నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
8.78 cr
సీడెడ్
4.42 cr
ఉత్తరాంధ్ర
3.12 cr
ఈస్ట్
1.82 cr
వెస్ట్
1.78 cr
గుంటూరు
2.28 cr
కృష్ణా
1.63 cr
నెల్లూరు
1.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
24.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.50 cr
ఓవర్సీస్
1.33 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
27.92 cr
‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రానికి రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.27.92 కోట్ల షేర్ ను రాబట్టి. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.7 కోట్లకి పైగా లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. అంతేకాదు అప్పటికి ప్రభాస్ కెరీర్లో కూడా ఇవే హైయెస్ట్ కలెక్షన్స్ కావడం విశేషం.