ఏ సినిమా అయినా వెంటనే జనాల్లోకి వెళ్ళాలి అంటే.. ఆ చిత్రం హీరో,డైరెక్టర్, హీరోయిన్ తో కంటే ముందుగా టైటిల్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అది క్యాచీ ఉంటే.. అందరి దృష్టి ఆ సినిమా పై పడుతుంది అనేది వాస్తవం. అందుకే టైటిల్స్ విషయంలో సినిమా యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒకసారి వారందరికీ టైటిల్ నచ్చింది అంటే కనుక వెంటనే ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకుంటూ ఉంటారు. ఆ టైటిల్ ను వాళ్ళు మాత్రమే వాడుకోవాలనమాట. వేరే సినిమా వాళ్ళు వాడుకోవాలి అంటే వీళ్ళతో సంప్రదింపులు చేసుకుని ఆ టైటిల్ ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే గతంలో ఓ హీరో సినిమా కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్ ను మరో హీరో సినిమా కోసం వాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ‘అర్జున్’ టైటిల్ ను ముందుగా బన్నీ సినిమా కోసం రిజిస్టర్ చేయించారు కానీ మహేష్ సినిమా వాళ్ళు అడగ్గానే దానిని ఇచ్చేసారు. ‘రచ్చ’ ఎన్టీఆర్ కోసం అనుకున్నారు కానీ చరణ్ సినిమాకి ఇచ్చారు. ‘చెప్పాలని ఉంది’ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నారు కానీ ఫైనల్ గా అది వడ్డె నవీన్ సినిమాకి పెట్టారు. సరిగ్గా ఇలాగే ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ టైటిల్ ను ముందుగా మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారు ‘ఆర్.ఆర్.మూవీ మేకర్స్’ వారు.
సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో మహేష్ చెయ్యబోయే సినిమా కోసం ఆ టైటిల్ ను ముందుగా రిజిస్టర్ చేయించుకున్నారు. కానీ తరువాత దశరథ్- దిల్ రాజులు రిక్వెస్ట్ చెయ్యడంతో ఆ టైటిల్ ను ఇచ్చేసారట. ఇది మాత్రమే కాదు ‘మిర్చి’ టైటిల్ ను కూడా మొదట మహేష్ సినిమా కోసమే ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.యల్.నారాయణ రిజిస్టర్ చేయించారు. కానీ ప్రభాస్ సినిమా కోసమే దానిని ఇచ్చేసారు.
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!