Mr. Pregnant Collections: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’… రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘బిగ్ బాస్ 4 ‘ కి గేమ్ ఛేంజర్ లాంటి కంటెస్టెంట్ అయిన సయ్యద్ సొహైల్ రియాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రానికి దర్శకుడు. రూపా కొడవాయుర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘మైక్ మూవీస్’ బ్యానర్‌ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి నిర్మించారు. ఆగస్టు 18న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

‘మైత్రీ మూవీ’ సంస్థ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మొదటిరోజు సో సోగా కలెక్ట్ చేసినా రెండో రోజు పర్వాలేదు అనిపించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.23 cr
సీడెడ్ 0.o7 cr
ఆంధ్ర(టోటల్) 0.17 cr
ఏపీ + తెలంగాణ 0.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.07 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.54 cr

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ (Mr. Pregnant) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.0 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.చాలా చోట్ల కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సో మొత్తంగా రూ.1.25 కోట్ల షేర్ ని రాబడితే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.0.54 కోట్లు షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ ఇంకా రూ.0.71 కోట్ల దూరంలో ఉంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus