Mrunal Thakur: చాలామంది అలా చెప్పడానికి ఆలోచిస్తారు. కానీ నేనలా కాదు: మృణాల్‌

ఒక సినిమాలో చేసి పాత్ర ఆ నటుడు / నటికి కలకాలం గుర్తుండిపోతుంది అంటారు. వాళ్లకు గుర్తుంటుందో లేదో కానీ ఆ నటుడు / నటి అభిమానికి బాగా గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఆ పాత్ర ఇమేజ్‌కు భిన్నంగా ఎవరైనా సినిమా చేస్తే ‘ఇలా మారిపోయారేంటి’ అని తెగ బాధపడిపోతారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కథానాయికల్లో మృణాల్‌ ఠాకూర్‌ ఒకరు. ‘సీతా రామం’ సినిమాలో సీతగా అలరించిన మృణాల్‌ ఆ తర్వాత బోల్డ్‌ లుక్‌లోకి మారిపోయింది. దీంతో ఫ్యాన్స్‌ హర్ట్‌ అయిపోయారు.

‘మా సీత ఇలా ఉండదు’ అంటూ తెగ ఇదైపోయారు. సోషల్‌ మీడియాలో హాట్‌ పోజులకే ఇలా అయిపోయారు. అలాంటి ఏకంగా ఆమె ‘లస్ట్ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో నటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ వామ్మో అనుకున్నారు. అయితే హీరోయిన్‌ ఎలా ఉన్నా ఆరాదించే ఫ్యాన్స్‌ మాత్రం వావ్‌ అనుకున్నారు. ఎలా ఉండాలో హీరోయిన్‌ ఇష్టం, ఇష్టపడటం, పడకపోవడం ఫ్యాన్స్‌ ఉద్దేశం అని అంటున్నారు. అయితే మృణాల్‌ మాత్రం ప్రజెంట్‌ జనరేషన్‌ గురించి చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను అని చెప్పింది. అంతేకాదు ఈ తరంలో పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్పింది.

ప్రస్తుతం నటీనటులు వ్యక్తిగత సంబంధాల గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ల భాగస్వామి సినీ పరిశ్రమకు చెందిన వారు కాకపోతే ప్రైవేటుగా ఉంచుతున్నారు. గతంలో చాలామంది నటులు ఈ విషయాల గురించి చెప్పడానికి ముందుకొచ్చేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తారలందరూ రిలేషన్‌షిప్‌ గురించి చెప్పేస్తున్నారు. అలా నేనూ ఇంతకుముందు నా ప్రేమ, బ్రేకప్‌ గురించి మాట్లాడాను. అసలు ఈ విషయాలు చాలామంది చెప్పడానికి ఆలోచిస్తారు. కానీ నేను అలా కాదు అని మృణాల్‌ చెప్పింది.

మన అనుభవాలను అందరితో పంచుకుంటే వాటి నుంచి కొన్ని విషయాలైనా నేర్చుకుంటారని అలా చెప్పాను అని మృణాల్‌ చెప్పింది. ఇక ఆమె లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ గురించి చెబుతూ దర్శకుడు ఆర్‌.బాల్కి ప్రేమలో నిజాయతి ఎంత ముఖ్యమో చూపించారు. యువత ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో నా ఎపిసోడ్‌ చూస్తే ఎన్నో విషయాలపై అవగాహన వస్తుందని నా అభిప్రాయం అని మృణాల్‌ (Mrunal Thakur) చెప్పింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus