Mrunal Thakur: పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మృణాల్!

సీరియల్ నటిగా అనంతరం బాలీవుడ్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటున్నారు. అయితే వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా కథ ఎంపిక విషయంలో ఈమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి.

తాజాగా ఈమె నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత బిజీ కానున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఇటీవల కాలంలో నటి మృణాల్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదివరకు పెళ్లి వార్తలపై స్పందించి తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేను అంటూ కూడా తెలియజేశారు. అయినప్పటికీ ఈమె గురించి వచ్చే పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఈ క్రమంలోనే మరోసారి ఈమె తన గురించి వస్తున్నటువంటి పెళ్లి వార్తలపై స్పందించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లెప్పుడు అంటూ ఈమెకు ప్రశ్న ఎదురు కావడంతో ఒక్కసారిగా గట్టిగా నవ్వినటువంటి ఈమె త్వరలోనే తాను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకునే సమయంలో ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను అంటూ ఈమె (Mrunal Thakur) పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus