బుల్లితెర నటిగా పలు హిందీ సీరియల్స్ లో నటిస్తూ అనంతరం బాలీవుడ్ అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు.ఇలా ఈమె పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ మృణాల్ జంటగా నటించిన ఈ సినిమాలో ఈమె సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో ఒదిగిపోయిన నటించారు.
ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు వెల్లు వెతుతున్నాయి. ఈ క్రమంలోనే ఈమె తన తదుపరి చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని సరసన నటించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియచేశారు. తాను మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మాయని తెలిపారు.
అయితే తనకు నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నం చేయగా తన తల్లిదండ్రులకు మాత్రం తాను ఇండస్ట్రీలోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపారు. ఇలా సినిమాలపై వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతోనే తనని ఇండస్ట్రీలోకి పంపించడానికి ఇష్టపడలేదని తెలిపారు. నటనపై ఉన్న ఆసక్తితో తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో నటిగా తనని తాను నిరూపించుకోవడంతో తన తల్లిదండ్రులు కూడా తన విషయంలో ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు (Mrunal Thakur) తన తల్లిదండ్రుల నుంచి కూడా ఏమాత్రం సపోర్ట్ లభించలేదని ఈమె తెలియజేసారు. ఇక ప్రస్తుతం తనని అందరూ కూడా స్మిత పాటిల్ తో పోల్చడం చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?