Mrunal Thakur: సీతారామం తర్వాత గ్యాప్ రావడానికి కారణం తెలిపిన మృణాల్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా ఓ క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా మొదటి తెలుగు సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె తెలుగులో భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా వస్తాయి అందరూ భావించారు.

అయితే తనకు మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ రెండవ సినిమాలో అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్న ఈమె ఇప్పుడిప్పుడే తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాని నటిస్తున్న సినిమాలో చేస్తున్నారు. ఈ విధంగా మొదటి సినిమా సక్సెస్ అయ్యి రెండవ సినిమా అవకాశం ఇంత ఆలస్యంగా రావడానికి గల కారణాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

ఇలా సీతారామం సినిమా తరువాత తాను పలువురు దర్శక నిర్మాతలను కలిశానని అయితే వారు మీరు సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి వంటి ఎంతో అద్భుతమైన పాత్రను చేశారు. మీరు తదుపరి సినిమాలలో ఇంతకన్నా మంచి పాత్రలో చేయాలి అంటే మాకు కొంత సమయం పడుతుందని చెప్పేవారట. ఇలా మొదటి సినిమా కన్నా తాను అద్భుతమైన పాత్రలో నటించడం కోసమే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండటంవల్ల గ్యాప్ వచ్చిందని ఈ సందర్భంగా మృణాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈమె (Mrunal Thakur) నాని 30 వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని ఇప్పటివరకు ఈ తరహా పాత్రలు రాలేదు అంటూ ఈమె తెలియజేశారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus