Mrunal Thakur: సీతా మహాలక్ష్మీ గట్టిగానే ప్లాన్ చేస్తోందిగా:మృణాల్‌ ఠాకూర్‌

మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం 2022 ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 76వ ఎడిషన్ వేడుకలు ప్రారంభమైంది. ఫ్రాన్స్‌‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు హాజరవుతారు. ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ సారి రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు భారత్‌ నుంచి ఎవరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు, తొలిసారిగా కొందరిని ఈ అదృష్టం వరించింది. దీంతో తారలంతా ఆనందంలో తేలియాడుతున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ‌లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునేది రెడ్ కార్పెట్. ఈ స్పెషల్ ఈవెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఇందులో చాలామంది అందాల ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్ పై తమ అందాలను ఒలకబోస్తారు.ఈ వేడుకకు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తొలిసారి హాజరుకానుంది.

దీనిపై ఆమె స్పందిస్తూ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని తెలిపింది. ‘ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మొదటిసారి ఆ వేదికపై అడుగుపెట్టనున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దర్శకనిర్మాతలతో మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. కొత్త అవకాశాల కోసం, నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను’ అని చెప్పింది. దీంతో ఈ అమ్మడు ఘోరంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక్కడి వాళ్లు చాల్లేదా అని నెటిజన్లు అంటున్నారు.

ఇక మరోవైపు వరుస సినిమాలతో అదరగొడుతోన్న (Mrunal Thakur) మృణాల్‌‌‌కు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మ‌ృణాల్ రిసెంట్‌గా ఓ కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది. మృణాల్ మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది. మూలుగా ఈ కారును పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు కొనుగోలు చేస్తారట. మృణాల్ ప్రస్తుతం తెలుగులో ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్నారట. ఈ మొత్తం సౌత్‌లో టాప్‌ హీరోయిన్స్ నయనతార, సమంతలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ల కంటే ఎక్కువని సమాచారం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus