Mrunal Thakur: టాలీవుడ్ నిర్మాతల్ని మృణాల్.. లెక్క చేయడం లేదా?

‘సీతా రామం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత పాత్రలో చాలా చక్కగా నటించి మెప్పించింది. నూర్ జాన్,సీత వంటి రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో ఎంతో హుందాగా నటించి ఆకట్టుకుంది. అంతకు ముందు బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించింది మృణాల్ ఠాకూర్. కానీ ‘సీతా రామం’ చిత్రంతోనే ఆమెకు దేశవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. ఈ సినిమానే ఆమెకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.

వాస్తవానికి ‘సీతా రామం’ తర్వాత మృణాల్ టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోతుంది అని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎందుకంటే ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తుండటంతో దర్శకనిర్మాతలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.మొత్తానికి ‘హాయ్ నాన్న’ ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాల్లో ఛాన్సులు కొట్టింది. ఇవి కూడా చిన్న సినిమాలు అయితే కాదు. వర్కౌట్ అయితే ఇవి కూడా వంద కోట్ల సినిమాలు అవుతాయి.

అలాగే మృణాల్ ఠాకూర్ రేంజ్ ఇంకా పెరుగుతుంది. కానీ ఆమె ‘కేర్ లెస్ నెస్’ వల్ల అది జరిగేలా కనిపించడం లేదట. ఎందుకంటే.. మృణాల్ చెప్పిన టైంకి సెట్స్ కి రావడం లేదట.ఇది ‘ఫ్యామిలీ స్టార్’ యూనిట్ చెప్పిన మాట. మరోపక్క ఆమె ప్రమోషన్స్ అంటే ఖాళీ లేదు అని చెబుతుందట.

ఇది ‘హాయ్ నాన్న’ టీం చెబుతున్న మాట. ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆ సినిమాల నిర్మాతలు నెత్తి కొట్టుకుంటున్నారు. మృణాల్ హిందీలో కూడా సినిమాలు చేస్తుంది నిజమే. కానీ పేరు తెచ్చిపెట్టిన టాలీవుడ్ ని ఆమె (Mrunal Thakur) పట్టించుకోకపోవడం అనేది సరైన పద్ధతి కాదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus