Mrunal Thakur: ర్యాప్ సింగర్ బాద్‌షాతో మృణాల్ డేటింగ్ ?

బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాషా సినిమాలలో వరసగా అవకాశాలు అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి తరచూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె ప్రేమ పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఈమె తెలుగింటికి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా మృణాల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి కోడలుగా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై స్పందించిన ఈమె ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు అయితే తాజాగా ఈమె గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ సింగర్ తో డేటింగ్ లో ఉన్నారు అంటూ మరొక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్‌షాతో మృణాల్ ఠాకూర్ డేటింగ్ ఒక వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.ఇటీవల హీరోయిన్ శిల్పా శెట్టి ఇంటిలో జరిగిన దివాళీ బ్యాష్ ఈవెంట్ కి మృణాల్ ఠాకూర్, బాద్‌షా అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిల్పా శెట్టి బాద్ షా ఇద్దరితో కలిసి దిగిన ఫోటోని ఈమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ పార్టీ ముగిసి వెళ్లే ముందు బాద్ షా మృణాల్ చేయి పట్టుకుని కనిపించారు.

ఇలా వీరిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కనిపించడంతో ఇది కాస్త డేటింగ్ రూమర్లకు దారితీసింది దీంతో పెద్ద ఎత్తున ఈ వీడియోను వైరల్ చేస్తూ ఈమె డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలను సృష్టించారు. అయితే మరి కొందరు మాత్రం ఇండస్ట్రీలో ఉన్న తర్వాత సెలబ్రిటీల మధ్య ఇలాంటివన్నీ సర్వసాధారణం అంటూ ఈ డేటింగ్ రూమర్లపై కామెంట్స్ చేస్తున్నారు మరి తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై (Mrunal Thakur)   మృణాల్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus