Mrunal Thakur: రిబ్బన్ కట్ చేయాలి అంటే నిమిషానికి అన్ని లక్షలు ఇవ్వాలా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే రెండు పేర్లు మాత్రమే వినపడతాయి. ఒకరు శ్రీలీల కాగా మరొకరు మృణాల్ ఠాకూర్. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు అయితే మృణాల్ మాత్రం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను గమనిస్తున్నారు.

అదేవిధంగా ఆ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఈమె సినిమాలకు కమిట్ అవుతున్నారు అందుకే ఈమె నటించే సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవుతున్నాయి. తాజాగా హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో కొంత స్టార్ డమ్ వస్తేనే పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ మాత్రం ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె దూరంగా ఉండడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ భారీగా ఉండడంతోనే షాప్ ఓనర్స్ తనని ఇన్వైట్ చేయడం లేదని తెలుస్తోంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావాలి అంటే ఆ షాపింగ్ మాల్ లో ఈమె ఎన్ని నిమిషాలు ఉంటే అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైతే గంటకు ఆరు కోట్ల పైన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా నిమిషానికి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. షాపింగ్ మాల్ లో ఎన్ని గంటలు ఉంటే అంత మొత్తంలో డబ్బు ఇవ్వాలని అడగడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎవరు కూడా ఈమెను (Mrunal Thakur) సంప్రదించలేదని తెలుస్తుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus