తెలుగు సినీ ప్రేక్షకులను సీతారామం సినిమాతో బాగా దగ్గరైన తర్వాత మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) క్రేజ్ మరింత పెరిగింది. ఆ సినిమా ఇచ్చిన బ్రేక్‌తో బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడ అనుకున్నంత రేంజ్ లో మాత్రం అమ్మడి హోదా పెరగడం లేదు. బాలీవుడ్ లో పట్టు కోసం చాలా.కాలంగా ప్రయత్నం చేస్తోంది. ఇక ఈసారి కెరీర్ స్థాయిని పెంచే ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. అమ్మడు మరో భారీ ప్రాజెక్ట్‌కి మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇది మరో క్రేజీ సీక్వెల్ కావడం విశేషం. బాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన అజయ్ దేవగణ్ (Ajay Devgn) సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. తెలుగులో సూపర్ హిట్ సినిమా మర్యాద రామన్న (Maryada Ramanna) సినిమాకు ఇది రీమేక్. అప్పట్లో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించి అజయ్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా, కొత్త ట్విస్టులతో తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సీక్వెల్‌లో సోనాక్షి (Sonakshi Sinha) స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశముందని బాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఆమె పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇదే నిజమైతే, మృణాల్‌కు బాలీవుడ్‌లో మరో మెజర్ బ్రేక్ అవుతుంది. అజయ్ దేవగణ్ సరసన నటించడం, పైగా సీక్వెల్‌లో మెయిన్ రోల్ చేయడం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సన్ ఆఫ్ సర్దార్ 2 కథకు కామెడీ, ఎమోషనల్ డ్రామా, కుటుంబ అనుబంధాలను మరింతగా జోడిస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కథలో కొత్త యాంగిల్స్‌ను తీసుకురావడం ద్వారా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్ 2025 జూలై 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మృణాల్ ఇప్పటికే బాలీవుడ్‌లో సూపర్ 30 (Super 30), జెర్సీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అజయ్ దేవగణ్‌తో కలిసి మరో మెమరబుల్ పాత్రకు సిద్ధమవుతోంది. మరి ఈ సీక్వెల్‌తో మృణాల్ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.