MS Dhoni,Nithiin: ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కి స్పెషల్ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేసిన ధోని?

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ తొందరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ విడుదల కాబోతుంది ఇలా ఈ సినిమా విడుదల చేసే దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నితిన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇకపోతే తాజాగా నితిన్ కోసం ప్రముఖ క్రికెట్ స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేసినట్లు ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నితిన్ కి తాను సైన్ చేసిన టీ షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ధోని ఇచ్చిన గిఫ్ట్ ని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ అంతా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మరి నితిన్ ధోనిను కలిశారా లేక గిఫ్ట్ పంపించారా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాను (Nithiin) నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఇక ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ కావడం నిజంగా ఎంతో అవసరం కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా నితిన్ కి ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus