నిర్మాత ఎమ్మెస్ రాజును ఆ రోజుల్లో ఇండస్ట్రీలో సంక్రాంతి రాజు అనేవారు. కారణం ప్రతి సంక్రాంతికి ఆయన ఓ సినిమాతో రావడం, అది భారీ విజయం అందుకోవడమే. అలాంటి సంక్రాంతి రాజు.. ‘మస్కా’ సినిమా తర్వాత పెద్ద హీరోలు, పేరున్న హీరోలతో సినిమాలు చేయడం లేదు. అయితే దర్శకుడి, నిర్మాతగా చిన్న సినిమాలతో ఇండస్ట్రీ టచ్‌లోనే ఉన్నారు. ఇటీవల తన సినిమాల గురించి, అప్పటి సంగతుల గురించి మీడియాతో మాట్లాడారు.
సినిమాల కథల విషయంలో చాలా పక్కాగా ఉంటానని చెప్పిన ఎమ్మెస్ రాజు.. ‘ఒక్కడు’ సినిమా విషయంలో మాత్రం పట్టించుకోలేదు అని చెప్పారు. దానికి కారణం ఆ సినిమా కథ మీద దర్శకుడు గుణశేఖర్‌కు ఉన్న గ్రిప్పే అని చెప్పారు. తొలుత ఆ సినిమా చర్చల సమయంలో గుణశేఖర్‌కు, తనకు భేదాభ్రిప్రాయాలు వచ్చాయని, అవి ప్రతి సినిమాలోనూ జరుగుతాయని తెలిపారు. అయితే ఆ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా తగ్గలేదని, గుణశేఖర్ అడిగినట్లు భారీ సెట్స్ వేసి మరీ సినిమా తీశామని గుర్తు చేశారు.
ప్రభాస్‌తో సినిమా చేస్తానని ఆయన కుటుంబానికి మాట ఇచ్చానని, అందుకు తగ్గట్టే ‘వర్షం’ సినిమా చేశానని, దానికి ఆయన కుటుంబం చాలా ఆనందించిందని కూడా తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు ప్రభాస్‌తో తీసిన ‘పౌర్ణమి’ ఆశించిన విజయం అందుకోకపోవడం మీకు తెలిసిన విషయమే. ఇక ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు హీరో సిర్ధార్థను ఎంపిక చేయడంతో కొంతమంది తనను విమర్శించారని చెప్పుకొచ్చారు ఎమ్మెస్ రాజు.
‘నువ్వొస్తానంటే..’ సినిమలో సిద్ధార్థ్ హీరో అంటే ఆ రోజుల్లో ఎమ్మెస్ రాజు నిర్ణయాన్ని చాలామంది విమర్శించారనట. చూడటానికి అమ్మాయిలా ఉన్నాడు వీడు హీరో ఏంటి?’’ అని సిద్ధార్థ గురించి ఎమ్మెస్‌రాజుతో అన్నారట వారంతా. అయితే ఆయన మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సినిమా తీసి హిట్ కొట్టారు. అంతేకాదు ఆ సినమాకు దర్శకుడు ప్రభుదేవా అని చెప్పినప్పుడు కూడా కొంతమంది విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు ఎమ్మెస్ రాజు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!