Ms Raju: సీనియర్ స్టార్ హీరోయిన్ భూమిక పై నిర్మాత ఎం.ఎస్.రాజు కామెంట్స్ వైరల్..!

‘దేవి’ ‘మనసంతా నువ్వే’ ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటాన’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో ఓ ఊపు ఊపేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు.. తర్వాత ‘వాన’ ‘తూనీగ తూనీగ’ ‘డర్టీ హరీ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా మారారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కాబోతుంది.ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా నిర్మాత యం.యస్.రాజు తన కొడుకు సుమంత్ అశ్విన్ తో కలిసి ఓ టాక్ షోలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు ఎం.ఎస్.రాజు . ముందుగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. తాను హీరో అవుదామని మొదట్లో అనుకోలేదని, ఒకప్పుడు 100 కిలోల బరువు ఉండేవాడినని.. ఆ బరువు తగ్గిన తర్వాత హీరో అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ.. తాను ‘ఒక్కడు’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ టైంలో స్టార్ హీరోయిన్ భూమిక, మహేష్ బాబులతో అతను కూర్చున్న టైములో..

సడెన్ గా భూమిక లేచి వెళ్లి ఫైటర్ ను తిట్టేసిందట. ఇంగ్లీష్ చాలా దారుణంగా తిట్టిందని.. దానికి కారణం ఏంటనేది అతనికి తెలీదని చెప్పుకొచ్చాడు ఎం.ఎస్.రాజు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే త్రిష, సిద్దార్థ్ వంటి హీరో హీరోయిన్లని తెలుగులో లాంచ్ చేసింది తానేనని, దర్శకుడిగా ప్రభుదేవాని కూడా లాంచ్ చేసానని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా తాను కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించినట్టు తెలిపారు. ఇదే క్రమంలో ‘డర్టీ హరి’ వంటి బోల్డ్ మూవీని ఎందుకు తీయాల్సి వచ్చిందని హోస్ట్ ప్రశ్నించగా.. ‘ఎం.ఎస్.రాజు ఎలాంటి సినిమానైనా తీయగలడు’ అని నిరూపించుకోవడానికి తీసినట్టు చెప్పుకొచ్చాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus