2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ గా 2024 చివర్లో ‘ముఫాసా’ (Mufasa) వచ్చిన సంగతి తెలిసిందే.’ముఫాసా’ స్కార్ ల గతాన్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు బేరి జెన్ కిన్స్. రెండో భాగంలో ‘ముఫాసా’ మెయిన్ రోల్ కాబట్టి.. ఆ పాత్ర కోసం మహేష్ బాబుని రంగంలోకి దింపాడు. ‘ముఫాసా’ పాత్రకు మహేష్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పాడు. దాని వల్ల ‘ముఫాసా’ తెలుగు వెర్షన్ కి మొదటి నుండి మంచి హైప్ ఏర్పడింది.
డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముఫాసా’ కి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 6.85 cr |
సీడెడ్ | 2.36 cr |
ఆంధ్ర(టోటల్) | 4.52 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 13.73 cr |
‘ముఫాసా’ (Mufasa) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో ఏకంగా రూ.రూ.13.73 కోట్ల షేర్ ని కేవలం తెలుగు వెర్షన్ తోనే రాబట్టింది. మిగిలిన వెర్షన్లతో కలుపుకుంటే రూ.15 కోట్ల వరకు షేర్ ఉంటుంది అని ట్రేడ్ పండితుల సమాచారం. మొత్తం మీద ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.12.5 కోట్ల లాభాలు అందించింది అని స్పష్టమవుతుంది.